Breaking News

ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వులు మరియు ప్రభుత్వ నిబంధనలను మీరి ఇసుక కార్యకలాపాలు చేయుట నిషిద్దం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక త్రవ్వకాలు నిర్వహించరాదు మరియు అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేసిన యెడల శిక్షార్హులు అని పేర్కొన్నారు . ఈ సందర్భంలో సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ, తూర్పు గోదావరి జిల్లా ఛైర్మన్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

ఈ సందర్బంగా జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి జిల్లాలో దాడుల వివరాలు తెలియ చేస్తూ…. ది. 02.11.2024 జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లా మరియు రెవిన్యూ డివిజన్ అధికారి, కొవ్వూరు వారు రవాణా అనుమతి పత్రములు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేయుచున్న 03 వాహనాలను గుర్తించి స్టేషన్ హౌస్ ఆఫీసర్, కొవ్వూరు పోలీసు స్టేషను వారికి తదుపరి ఆదేశాలు వచ్చు వరకు తగు చర్యల నిమిత్తం అప్పగించుటమైనది.

ది. 05.11.2024 జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లా మరియు రెవిన్యూ డివిజన్ అధికారి, రాజమహేంద్రవరం వారు రవాణా అనుమతి పత్రములు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేయుచున్న 03 వాహనాలను గుర్తించి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ధవళేశ్వరం పోలీసు స్టేషను వారికి తదుపరి ఆదేశాలు వచ్చు వరకు తగు చర్యల నిమిత్తం అప్పగించుటమైనది.

ది. 05.11.2024 రాత్రి సమయంలో జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గామన్ బ్రిడ్జి వద్ద బిల్లులు లేకుండా వెళుతున్న వాహనాలు ఇసుక అక్రమ రవాణా చేయుచున్నట్లు 03 వాహనాలను గుర్తించి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రాజమహేంద్రవరం వారికి తదుపరి ఆదేశాలు వచ్చు వరకు తగు చర్యల నిమిత్తం అప్పగించిఉన్నారు. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు 01 వాహనాన్ని గుర్తించి తగు చర్యల నిమిత్తం పోలీసు స్టేషను వారికి అప్పగించిఉన్నారు. ది.06.11.2024 ఉదయం జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం వారు రెవెన్యూ సిబ్బందితో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ముగ్గళ్ళ గ్రామంలో 03 ఇసుక అక్రమ నిల్వ ప్రాంతాలు..

1) జగన్ కాలని- 192 క్యూ.మీ.,

2) ముగ్గళ్ళ సుబ్రహ్మణ్యం స్వామి గుడి బయట పాశాలమ్మ తల్లి గుడి ఎదురుగా – 45 క్యూ.మీ.,

3) ముగ్గళ్ళ గ్రామం గోదావరి మాత బొమ్మ వెనుక వీధిలో- 84 క్యూ.మీ., గుర్తించి, మొత్తం ఇసుక పరిమాణం 321 క్యూ.మీ, గా నిర్దారించి గ్రామ రెవెన్యూ అధికారి వారికి తగు చర్యల నిమిత్తం అప్పగించటమైనదని జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *