-దేవాదాయ భూముల్లో నివాసముంటున్న నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ను కలిసి విజ్ఞప్తి చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తరతరాల నుండి అంతర్వేది దేవస్థానం భూములను సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, శ్రీ …
Read More »Monthly Archives: January 2025
రాష్ట్రంలో నూతన విద్యా విధానం పై ప్రాంతీయ సదస్సు లో మేధోమథనం
– విద్యార్థుల్లో సృజనాత్మకత జోడించే సంస్కరణల దిశగా అడుగులు – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మానవ వనరులు అధికారులు, హెచ్ ఎం లతో సమావేశం – హాజరైన తూర్పు, కోనసీమ, కాకినాడ జిల్లా కలెక్టర్లు – విజయ రామరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ర్టంలో పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఫలవంతమయ్యే సూచనలతో ముందుకు రావాలని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ రామరాజు అన్నారు. మంగళవారం స్థానిక వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో పాఠశాలల …
Read More »వీధి దీపాల కోసం నగరపాలక సంస్థ వారి స్కై లిఫ్ట్ వెహికల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర వీధి దీపాలను అమర్చేందు, మరమ్మతులు చేసేందుకు సులభతరంలో చేసే స్కై లిఫ్ట్ వాహనాన్ని విజయవాడ నగర పాలక సంస్థ వారు 15వ ఆర్థిక సంఘం నిధులతో కొన్నారని ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్కై లిఫ్ట్ వాహనం, హై మాస్ట్ లైట్స్, ప్రధాన రహదారులు జాతీయ రహదారులలో ఉన్న వీధి దీపాలను అమర్చటం లేదా మరమ్మతులు చేయటం లాంటి వాటికోసం ఆధునిక వాహనం ద్వారా చేపట్టడం వల్ల …
Read More »పన్ను చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం
-ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ పేమెంట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలు సకాలంలో సులభంగా పన్ను చెల్లించుటకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల ఉన్న క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పన్ను కట్టేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అని చెప్పారు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. విజయవాడ నగర పరిధిలో గల క్యాష్ కౌంటర్ అన్నిటిలోనూ ప్రజలు క్యూ లైన్ లో …
Read More »గ్యాస్ పంపిణీదారులు, డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం……
వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి….. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ…… అదనపు సొమ్ము వసూలు చేస్తే టోల్ ఫ్రీ 1967 కు ఫిర్యాదు చేయొచ్చు…. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దీపం 2 పథకం అమలులో భాగంగా వినియోగదారులకు డెలివరీ బాయ్స్ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అట్లు వసూలు చేసిన పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు …
Read More »పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలి రీ సర్వే ప్రక్రియపై కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుడివాడలోని కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గుడివాడ డివిజన్ పరిధిలోని తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లకు కార్యశాల నిర్వహించి రీ సర్వే ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ, …
Read More »తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం నగర కమిషనర్, పారిశుద్ధ్య నిర్వహణ నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి తరలించాలన్నారు. రహదారుల ప్రక్కన …
Read More »చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న రెండో రాష్ట్రం ఏపీనే
-చంద్రబాబు నాయుడు ఆలోచనకు రూపమే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరిన్ని ప్లాంట్లు రావాలి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు: చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లును ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గుంటూరు లోని జిందాల్ వేస్ట్ …
Read More »వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ల సేవలు భేష్
-చంద్రబాబు సంస్కరణలతోనే విద్యుత్ రంగంలో పెట్టుబడులు -విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సమస్య పరిష్కారానికి చర్యలు -8 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తే లక్ష్యం -రాజకీయ మనుగడ కోసమే కొందరు అసత్య ప్రచారాలు – ఏపీ ఎస్ఈబీ ఇంజనీర్స్ డైరీ ఆవిష్కరణలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి: విజయవాడ వరదలతో పాటు అనేక ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ రంగ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారని విద్యుత్ శాఖ మంత్రి …
Read More »మళ్లీ జన్మ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా
-తెలుగుజాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా -ఉద్యోగాలు చేయడం కాదు… ఇచ్చే స్థాయికి మనవాళ్లు ఎదగాలి -రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం -వర్క్‌ఫ్రం హోం హబ్‌గా ఏపీని మార్చుతాం -జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్/స్విడ్జర్లాండ్, నేటి పత్రిక ప్రజావార్త : ‘నిత్య స్ఫూర్తి నిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా. నేనెక్కడున్నా నా మనసు తెలుగు జాతి కోసమే తపనపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ …
Read More »
Prajavartha Online Telugu News