Breaking News

Monthly Archives: January 2025

6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు బుధవారం 6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు గారు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక …

Read More »

రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, నిర్మాణ పనుల వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అరండల్ పేట, బ్రాడిపేటల్లో రోడ్ల మీద ఆక్రమణలను యుద్దప్రాతిపదిన తొలగించడానికి, ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అరండల్ పేట 1వ లైన్, బ్రాడీపేట 1, 4వ లైన్ లు, లాడ్జి సెంటర్ నుండి బ్రాడిపేట …

Read More »

తూర్పు నియోజక వర్గ పరిధిలో నేషనల్ ఓటర్లు డే -2025…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, ఎన్ టి ఆర్ వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో నేషనల్ ఓటర్లు డే -2025 నిర్వహించవలసినదిగా ఆదేశించి యున్నారు. ది.25.01.2025 తేదీన 15వ జాతీయ ఓటరు దినోత్సవముగా పరిగణించుచు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన అన్ని గుర్తింపు పొందిన గవర్నమెంటు / ప్రైవేట్ / కాలేజీలకు / ఇన్స్టిట్యూషన్స్ కు ఈరోజు అనగా ది.22.01.2025 @04.00pm ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ …

Read More »

వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అవసరమైన అంచనాలు రూపొందించి వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు ప్రయోజనకరంగా ప్రతి ఏడాది జూన్ మాసంలో కాలువలకు సాగునీటి విడుదల చేయడం …

Read More »

లెనినిజం అజేయం

-తరతరాల మానవ జాతికి స్ఫూర్తిదాయకం -వామపక్ష భావజాలం విస్తృతం -లెనిన్‌ శత వర్థంతి ముగింపులో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గానికి, ప్రజానీకానికి లెనినిజం అజేయంగా నిలిచిందని, పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ దారులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలకు సోషలిస్టు రాజ్యనిర్మాత విఐ లెనిన్‌ ఒక స్ఫూర్తిదాయకమని వక్తలు ఉద్ఘాటించారు. ప్రపంచ ప్రప్రథమ సోషలిస్టు రాజ్య నిర్మాత, విప్లవ యోధుడు కామ్రేడ్‌ విఐ లెనిన్‌ శత వర్థంతి ముగింపు (101) సందర్భంగా మంగళవారం విజయవాడ లెనిన్‌ సెంటరులోని లెనిన్‌ …

Read More »

అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభానికి ముందే నగరంలోని ప్రధాన రహదారులను ట్రాఫిక్ రద్దీకి తగిన విధంగా సిద్దం చేసుకోవాలని, ట్రాఫిక్, రైల్వే, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంభర్ లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి , జిఎంసి, రైల్వే, ఆర్&బి, ట్రాఫిక్ పోలీస్ …

Read More »

సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నింటిని వేగవంతం చేయాలని, నోడల్ అధికారులు కార్యదర్శులు చేస్తున్న సర్వేల పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అడ్మిన్ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరం నందు సచివాలయాల కార్యదర్శులు మరియు నోడల్ అధికారులతో సమావేశం నిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ తొలుత కార్యదర్శుల వారీగా మిస్సింగ్ సిటిజెన్స్, పి.ఏ.సి.యస్, హౌసింగ్ జియో ట్యాగ్, యన్.పి.సి.ఐ, …

Read More »

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు తీసుకోవాలని, మైక్రో పాయింట్స్ వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పారిశుధ్య పనులు జరిగేలా కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నాజ్ సెంటర్ రిజర్వాయర్ లోని మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేసి, కార్మికులు, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

పేదలకు ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర

-జగనన్న కాలనీల సందర్శనలో మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఇళ్లపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ.. వారికి నిలువ నీడ లేకుండా చేస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నున్న, సూరంపల్లిలోని జగనన్న లేఅవుట్ లను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. త్రాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గృహ యజమానులు మల్లాది విష్ణు వద్ద వాపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. బస్సు …

Read More »

దేవస్థానంలో వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీ చేయాలి

-సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వాయిద్య కళాకారుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంగీత వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు ఎల్ వి చెన్నారావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారావు ఆంధ్రప్రదేశ్ సంగీత వాయిద్య కళాకారుల సంఘం నూతన అధ్యక్షురాలిగా ఎస్ …

Read More »