-ఇబ్రహీంపట్నం లో వడ్డె ఓబన్న జయంతోత్సవాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు. బ్రిటీషు వారిపై ఓబన్న జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద కొండపల్లి మున్సిపాలిటీ వడియరాజుల సంక్షేమ సంఘం నిర్వహించిన వడ్డె ఓబన్నా జయంతోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్థన్ లతో కలిసి పాల్గొన్నారు. …
Read More »Monthly Archives: January 2025
రామ్ సినిమాస్ ధియేటర్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల ప్రాంతంలో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ముఖ్యఅతిథిగా ఎంపికేశినేని శివనాథ్ హాజరైయ్యారు. రామ్ సినిమాస్ పేరుతో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రొజెక్టర్ రూమ్‌ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం ప్రొజెక్టర్ స్విచ్చ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ధియేటర్ యాజమాన్యానికి ఎంపికేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో రాంగోపాల్ థియేటర్‌గా విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిందన్నారు. థియేటర్లు మనుషుల మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. …
Read More »గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-కలెక్టర్ కార్యాలయంలో గుణదల చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం -సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల మేరీమాత ఉత్సవాలు దేశంలో తమిళనాడు నాగపట్నంలో, విజయవాడ లో మాత్రమే జరుగుతాయని…ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతాము. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా చర్చ్ కౌన్సిల్ …
Read More »సమిష్ఠిగా ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-పరిటాల లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం -మినీ గోకులం షెడ్లు, సిసి రోడ్డు ప్రారంభోత్సవం -ప్రారంచించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి జిల్లాను ప్రగతి పథంలో వుంచేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో …
Read More »పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు నేతృత్వంలో సంక్రాంతి పండుగ సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో శనివారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సిటీ ఆర్మడ్ రిజర్వు పోలీస్ గ్రౌండ్ నందు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ పేరేడ్ మైదానం నందు బోగిమంటలు, గంగిరెద్దులు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులతో గ్రామం లాగా తయారై కర్రసాము, వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ నేపధ్యంలో నగర పోలీస్ …
Read More »నగరంలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాకులకు సూచించారు. నగరంలోని వన్ న్ లేబర్ కాలనీలో గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ …
Read More »ఆహార ఉత్పత్తుల్లో కచ్చితమైన ప్రమాణాలు పాటించాల్సిందే
– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు – ప్రత్యేక బృందాలతో ముమ్మర తనిఖీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార ఉత్పత్తుల ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఉత్పత్తులు అత్యంత నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిందేనన్నారు. పండగ వేళ ఆహార భద్రత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు …
Read More »వడ్డె ఓబన్న పోరాటం.. భావితరాలకు స్ఫూర్తి మార్గం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న పోరాటం చిరస్మరణీయమని, భావితరాలకు స్ఫూర్తి మార్గమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి సందర్బంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 304 షేడ్స్ నిర్మాణం పూర్తి చేశాం…
-రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. -గ్రామంలో 1.85 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ప్రారంభించి, అనంతరం సంక్రాంతి సంబరాల వేడుకల్లో…. -మంత్రి కందుల దుర్గేష్ -కలెక్టర్ పి ప్రశాంతి నిడదవోలు( విజ్జేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలుకోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విజ్జేశ్వరం గ్రామంలో రు. 1.85 …
Read More »కలక్టరేట్ లో వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలు
-డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో అధికారికంగా వడ్డే ఓబన్న జన్మదిన వేడుకలను జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. స్థానిక కలెక్టరేట్ లో శనివారం ఉదయం వడ్డే ఓబన్నా జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, బ్రిటిష్ …
Read More »
Prajavartha Online Telugu News