Breaking News

Monthly Archives: July 2026

దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు కలిగే విధంగా పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలని అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్వర్యంలో ఆగష్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వివిధ దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో చలో ఢిల్లీ పోష్టర్ను విడుదల చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియా …

Read More »

నా చిన్నారిని నాకు ఇప్పించండి… : డాక్టర్ కిమిడి గాయత్రి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన 23 నెలల బిడ్డను భర్త ఎత్తుకొని పోయి 10 రోజులుగా కనిపించకుండా దాచేశాడని తనకు అప్పగించాలని బాధితురాలు డాక్టర్ కిమిడి గాయత్రి కన్నీటి పర్యంతం వేడుకున్నారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తన అత్తమామలు కూడా భర్తకే మద్దతు ఇచ్చి తనను మానసికంగా వేధించారని అరోపించారు. వేధింపులు …

Read More »

కేంద్ర జీఎస్‌టీఏటీ – విజయవాడ, విశాఖపట్నం బెంచ్‌ల ప్రారంభం

మంగళగిరి/గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్‌టీఏటీ) విజయవాడ, విశాఖపట్నం బెంచ్‌లు గురువారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర జీఎస్‌టీఏటీ ఉపాధ్యక్షులు మరియు సభ్యులు (న్యాయ), (ఆంధ్రప్రదేశ్) భాస్కర్ రెడ్డి వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంచ్ ల ప్రారంభోత్సవం ఒక చారిత్రక మైలురాయి అన్నారు. జీఎస్‌టీ వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన పరిణామంగా, రెండు బెంచ్‌లలోనూ అప్పీళ్ల విచారణలు ప్రారంభోత్సవం జరిగిన అదే …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. 43 వ డివిజన్ ఊర్మిళ నగర్ చెందిన షేక్ నసీర్ (20) థైరాయిడ్ తో బాధపడుతూ వైద్యం …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్…

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పింఛన్లు , ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం,ప్రభుత్వ పథకాలు,ఇతర స్థానిక సమస్యలకు సంబంధించిన అంశాల పై వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజా …

Read More »

18వ ఇషా గ్రామోత్సవానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం

-ఆగస్టు 9న గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి 18వ ఇషా గ్రామోత్సవం – ఆంధ్రప్రదేశ్ డివిజనల్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆగస్టు 9న గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read More »

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన అంతర్జాతీయ పర్వతారోహకుడు అన్మిష్ వర్మ

-ప్రపంచ విజేత అన్మిష్ వర్మను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్, అంతర్జాతీయ పర్వతారోహకుడు అన్మిష్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన విజయాలకు అన్మిష్ వర్మను మంత్రి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. …

Read More »

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం

-జ్యోతి సురేఖ వెన్నం విజయాలను అభినందించిన మంత్రి -ఇటీవల సాధించిన వరల్డ్ కప్ పతకాలను మంత్రితో పంచుకున్న జ్యోతి సురేఖ వెన్నం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయంలో తన చాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ఇటీవల సాధించిన వరల్డ్ కప్ లో సాధించిన పతకాల విశేషాలను మంత్రికి వివరించారు. ఆమె వెంట తండ్రి కూడా పాల్గొన్నారు. జ్యోతి …

Read More »

జొన్నగిరి గోల్డ్ మైన్‌ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’

-దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గనికి కొత్త గుర్తింపు -కర్నూలు జిల్లా బంగారు గనికి అధికారికంగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా *‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’*గా మార్చింది. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన తొలి బంగారు గనిగా గుర్తింపు పొందిన ఈ గని భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ బంగారం ఉత్పత్తి కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని …

Read More »

పాలకొల్లులో క్రోచెట్ లేస్ కళాకారులకు కంటి పరీక్షలు

-పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశంతో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గురువారం పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని యలమంచిలిలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో మొత్తం 217 మంది కళాకారులకు కంటి పరీక్షలు చేశారు. అందులో ఐదుగురికి శుక్లాలు సమస్య ఉన్నట్టు గుర్తించారు. …

Read More »