విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10.00 గంటల నాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,718 మంది (93.48 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. డిజిటలైజ్ చేసిన వివరాల్లో 2,43,415 …
Read More »Monthly Archives: July 2026
ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పెజ్జోనిపేట్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల …
Read More »మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-2 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …
Read More »పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ గోపాల నాయక్ ఆధ్వర్యంలో ఏపీఐఐసీ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో “సఫాయి అప్నావో – బీమారి భగావో -2026” కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను …
Read More »ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ జి వి ఎస్ పద్మావతి, ట్రస్టీలు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి …
Read More »వైద్యరంగంలో జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివి… : మంత్రి సత్య కుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా జయప్రద ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రాత్రి విజయవాడలోని ఎన్ ఎ సి కళ్యాణ వేదిక లో జయప్రద ఫౌండేషన్ వారి సేవా సంకల్పం-2026 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు దశరథ జనార్దన్ రావు ఈ ఫౌండేషన్ అనతి కాలంలోనే ప్రజలకు చేరువ చేశారన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే వేల …
Read More »ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీ
-భూ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి -భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ -ట్యాంపర్ చేయలేని విధంగా ల్యాండ్ రికార్డులకు హై సెక్యూర్టీ -మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రక్షాళన-విముక్తి-భద్రత అంశాలుగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని …
Read More »అమరావతిలో పీఎన్ బీ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
-రాష్ట్ర ప్రభుత్వం- పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఎంఓయూ -సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ లో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్-పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- పీఎన్ బీ సీఈఓ, ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. …
Read More »రంపచోడవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
-మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం -‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో ముచ్చటించనున్న చంద్రబాబు -ప్రభుత్వ బడిలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్ – జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే మెగా పేరేంట్ – టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. విద్యార్థులతో కలిసి ఇరువురు …
Read More »క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశం
-సీఎం చంద్రబాబుతో క్వాంటినమ్ టెక్నాలజీస్ సీఈఓ రాజీబ్ హజ్రా భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పని చేయటం ప్రారంభిస్తుందని.. ఇప్పటికే క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీలు ఏపీలో పని ప్రారంభించాయని వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి ఫుల్ …
Read More »
Prajavartha Online Telugu News