యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్‌షిప్–2025 విజేతలుగా అమరావతి క్రషర్స్

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు 15 నుండి 25 వరకు పదకొండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్‌షిప్–2025 విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో అమరావతి క్రషర్స్ అద్భుత ప్రతిభ కనబరచి కర్నూలు నైట్స్పై 50–37 తేడాతో విజయం సాధించి ప్రతిష్ఠాత్మక యువ ఆంధ్ర కబడ్డీ చాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ విజయంతో అమరావతి క్రషర్స్ మొదటి స్థానం దక్కించుకోగా, కర్నూలు నైట్స్ రన్నరప్గా ముగించారు. అంతకుముందు జరిగిన ప్లే ఆఫ్‌లో విజయనగరం నింజాస్ జట్టు విజాగ్ కమాండోస్పై 48–31 తేడాతో గెలుపొందింది.

వాలెడిక్టరీ కార్యక్రమంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం టిడిపి యువ నేత గద్దె క్రాంతి కుమార్ (విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు కుమారుడు) ముఖ్య అతిథిగా పాల్గొని అమరావతి క్రషర్స్ జట్టుకు విజేతల ట్రోఫీని అందజేశారు. రన్నరప్ ట్రోఫీని కర్నూలు నైట్స్‌కు అరుణ రావు నక్కల (మాజీ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు & వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్) మరియు  శ్రీకాంత్ యలమంచిలి (జనరల్ సెక్రటరీ, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్) సంయుక్తంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి ఎం. సుబ్బరాజు (ఖజానాదారు), కె.వి. నంచరయ్య (జాయింట్ సెక్రటరీ), ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మరియు వికాస్ (సీఈఓ, యువ కబడ్డీ సిరీస్) హాజరయ్యారు. ఈ సందర్భంగా బహుమతులు మరియు బెస్ట్ ప్లేయర్ అవార్డులు (వివరాలు జతపరచబడ్డాయి) కూడా ప్రదానం చేయబడ్డాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *