రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 17 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏ డి సి పి ఎం సత్య వేణి, సి పి సూరజ్ కుమార్, ఎస్సీ జి పాండురంగారావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్పందన లో వొచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నిరంతరం సమీక్ష చేస్తున్నా పనితీరులో ప్రగతి సాధించాక పోవడం పై కమిషనర్ వివరణ కోరారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పలు మార్లు సూచించడం జరిగిందని, అయినా కొన్ని వార్డు సచివాలయాల్లో ఆమేరకు ప్రగతి సాధించాక పోవడం ఏమిటని తెలిపారు. సింహాచల నగర్, భరత్ నగర్, బర్మా కాలనీ, వి ఎల్ పురం, ఎం ఆర్ వో ఆఫీస్ రోడ్, ఆనంద్ నగర్, మంగళవారపు పేట, గొరక్ష పేట, కొక భాస్కరమ్మ నగర్, సుబ్బారావు నగర్, ఆదర్శ నగర్, నారాయణ పురం, భాస్కర్ నగర్, సీతంపేట, శ్రీరామ్ నగర్, తోట రామమ్మ నగర్, ఇందిరా నగర్, వెంకటేశ్వర నగర్ వార్డు సచివాలయాల్లో పౌర సేవలు నమోదు విషయంలో చాలా తక్కువగా నమోదు అవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తత అవసరం అని దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం హెల్త్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేసుకొని హెల్త్ కార్యదర్శి, శానిటరీ కార్యదర్శి తదితరులతో పనిచేయాల్సి ఉందన్నారు. ఒక్క డెంగ్యూ కేసు నమోదు కాకుండా చూడాలని, ఒక వేళ ఏదైనా కేసు నమోదు అయితే ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఒక ప్రోఫార్మా కూడా ఇస్తున్నామని, ప్రతి రోజూ సచివాలయ వారీగా నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
స్పందన కి సంబంధించి శానిటేషన్ కి సంబంధించి 34, హెల్త్ కి చెందిన 18 ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయని, వెంటనే ఎస్ ఎల్ ఏ లోని మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయం లోగా వాటిని పరిష్కారం చుపాలన్నారు.
Prajavartha Online Telugu News