Breaking News

రాష్ట్ర ప్రభుత్వం గేజిట్ నోటిఫికేషన్ జారీ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం కేంద్రం గా జిల్లా అటవీశాఖ కార్యాలయం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గేజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా అటవీ అధికారి బి నాగ రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత అటవీ కార్యాలయాల విభజన పునర్వ్యవస్థీకరణ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జిల్లా అటవీ కార్యాలయం, రాజమహేంద్రవరం డివిజన్ గా నోటిఫైడ్ చేస్తూ గేజిట్ నెంబర్ 23/2022 ద్వారా తేదీ : 28.9.2022న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నాగ రాజు తెలియచేసారు. రాజమహేంద్రవరం ప్రధాన కార్యాలయంగా తూర్పు గోదావరి డివిజన్ 8,902.98 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం విస్తిర్ణత కలిగి ఉన్నట్లు గేజెట్ లో ప్రచురించారు. దివాన్ చెరువు, తిరుమలయా పాలెం, మల్లవరం, నల్లజెర్ల, కరకపాడు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, మాతంగి మెట్ట (సి ఎ ఏరియా) ప్రాంతం లో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ లో రాజా నగరం, రంగంపేట, కోరుకొండ , గోకవరం, అనపర్తి, బిక్కవోలు, నల్లజర్ల, దేవరపల్లి, తాళ్లపూడి, చాగల్లు, పెరవలి గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు ఉండ్రాజవరం మండలాలు పరిధిలోని గ్రామ పంచాయతీ లు, రెవెన్యూ గ్రామాలలో గుర్తిస్తూ మండలాలు వారీగా వివరాలు ప్రచురించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *