Breaking News

విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నరాష్ట్ర ముఖ్యమంత్రి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గత మూడు సంవత్సరాలుగా ఆ రంగానికి కేటాయించిన రు.53 వేల కోట్ల నిధులను వెచ్చించడమే ప్రత్యక్ష నిదర్శనం అని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు.

బుధవారం స్థానిక గైట్ కళాశాల ఆవరణలో జరిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ల నాడు నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి. రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మెరుగైన బోధనను అందించే సామర్థ్యం పెంచే దిశలో స్కూల్స్ లో పెద్ద ఎత్తున నాడు నేడు పనులను ప్రారంభించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆ దిశలో ఫేజ్ -1 లో ₹.3700 కోట్లు, ఫేజ్ -2 లో ₹.8000 వేల కోట్లు కేటాయించి ఆ పనులు చెయ్యడం ద్వారా ముఖ్యమంత్రి ఆలోచనను చూపుతోందని అన్నారు. నాడు నేడు పనులు తరగతి గదుల డిజిటలైజేషన్ (digitalization) ప్రక్రియ ఆలోచన సిఎం ముందు ఉంచి 65 ఇంచేస్ టివి ఏర్పాటు ను స్కూల్ లాబ్ లో ఏర్పాటు చేసి, ఆయా తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులు అక్కడ తరగతులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, అందువల్ల ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపామని రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ విషయం పై సిఎం ప్రతి తరగతి గదికి టివి ఏర్పాటు డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చెయ్యాల్సిందే అని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఉన్నత స్కూల్స్ లో ఇంటర్ భోధన చేపట్టే దిశలో అప్ గ్రేడ్ చెయ్యడం జరిగిందన్నారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ పై ఎంతో గురుతరమై న భాధ్యత ఉందని, నాడు నేడు పనులను సమర్థవంతంగా చేపట్టి పూర్తి చెయ్యడానికి వారు గురుతరమై విధులను నిర్వర్తించడం ఇక్కడ కీలకంగా ఆయన అభివర్ణించారు.

జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 15 ఉన్నత పాఠశాలలను జూనియర్ కాలేజి లుగా ఉన్నతికరణ చెయ్యడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆయా పనులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టవలసిన నిర్మాణ తదితర పనులకు అవసరమైన సిమెంట్, ఇసుక, తదితర ముడి సరుకులు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డ్ కమిషనర్ ఏం వి శేషగిరి బాబు, నాడు నేడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏ. మురళి, సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర ఏ పి డి – బి. శ్రీనివాస్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ లు, ఎస్ ఎస్ ఎ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *