Breaking News

సీఎం జగన్ సారథ్యంలో కనివినీ ఎరుగని రీతిలో సెంట్రల్ ప్రగతి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 1.20 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణ పనులకు భూమిపూజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గం అనితర సాధ్యమైనటువంటి అభివృద్ధిని సాధించిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 57, 58, 61 డివిజన్లలో రూ. 1.20 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి గురువారం ఆయన భూమిపూజ నిర్వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి నిత్యం అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రతి డివిజన్ కళకళలాడుతోందని మల్లాది విష్ణు అన్నారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణంలో కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రోత్సాహం, సహకారంతోనే ఇదంతా సాధ్యపడిందని తెలియజేశారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో భాగంగా న్యూరాజరాజేశ్వరి పేటలో రూ.19.99 లక్షల వ్యయంతో నూతన రహదారి., తోటవారి వీధిని ఇన్నర్ రింగ్ తో అనుసంధానం చేస్తూ రూ.15.35 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం, UGD, తాగునీటి పైపులైన్ల పనులతో పాటు 61వ డివిజన్లో భాస్కర రావు కొట్టు సెంటర్, సచివాలయ రోడ్డు, శాంతి నగర్ లో రూ.84.35 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. పూర్తి చేసుకున్న పనుల ప్రగతినంతా నాడు – నేడు ద్వారా ఎప్పటికప్పుడు ఫోటో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 61వ డివిజన్లో రూ. 2.50 కోట్ల నిధులతో అభివృద్ధి పరిచిన వైఎస్సార్ పార్కుని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు. అలాగే నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 2 కోట్ల ఎమ్మెల్యే నిధులతో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వేసిన రోడ్లపై పర్యటనలు చేస్తూ.. టీడీపీ నేతలు మాపై బురదచల్లడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికై మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవీ రాజారమేష్, ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, కాళ్ల ఆదినారాయణ, నాళం బాబు, చెన్నకేశవరెడ్డి, నెల్లిగోవింద్, తోపుల వరలక్ష్మి, అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *