Breaking News

1వ అంతర్జాతీయ సదస్సు సెప్టెంబర్ 15, 16…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ (స్వయంప్రతిపత్తి) కళాశాల (A+), సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణ సవాళ్లు మరియు పరిష్కారాలపై 1వ అంతర్జాతీయ సదస్సును సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రామచంద్రరావు తెలిపారు. (ICECRSF-23) ప్రభుత్వ (స్వయంప్రతిపత్తి) కళాశాల, రాజమహేంద్రవరం 2023 సెప్టెంబరు 15 & 16 తేదీల్లో పర్యావరణ సవాళ్లు మరియు సుస్థిర భవిష్యత్తు కోసం నివారణలు (ICECRSF-23)పై 1వ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యార్థులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం జరిగింది. పర్యావరణ సమస్యలు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు పై ఈ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బి.మల్లికార్జున్ 16 సెప్టెంబర్ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సంభాషించేలా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొని విద్యార్థులు పర్యావరణ నేటి పరిస్థితుల పై అవగాహన పెంచుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *