Breaking News

ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

– అధికారుల‌తో జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నిక‌లు, రెవెన్యూ, పోలీస్ త‌దిత‌ర శాఖల అధికారులు సమన్వయంతో ప‌నిచేస్తూ ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భ‌ద్ర‌త‌కు పటిష్ట చర్యలు తీసుకుంటూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. గురువారం గొల్ల‌పూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ప్రతి నెల ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌రావు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల సెల్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *