Breaking News

సుజనా ను గెలిపిస్తాం…

-రెల్లి సంఘం నేత ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)నీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని రెల్లి హక్కుల సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎర్రంశెట్టి ప్రసాద్ అన్నారు. భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని అధికారం లోకి వచ్చిన జగన్ అవే వర్గాలకు చెందిన 27పథకాలను రద్దు చేసారని అన్నారు. ఆ వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసారని ఆరోపించారు. జగన్ పై ప్రజల్లో నమ్మకం పోయిందని ఏపిలో కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు. పశ్చిమంలో సుజనా చౌదరిని మెజార్టీ తో గెలిపించాలని రె ల్లి సామాజిక వర్గానికి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యక్తిగత ప్రయోజనంతో వీరబాబు అనే వ్యక్తి ఫైల్ చేసిన 10 ద్వితీయ అప్పీళ్లను తిరస్కరిస్తూ తెలుగులో తీర్పు

-న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కేరాఫ్ అడ్రస్ తో వ్యక్తిగత ప్రయోజనంతో వీరబాబు అనే వ్యక్తి ఫైల్ చేసిన 10 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *