Breaking News

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,76,958 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక సరఫరాలో నెలకొంటున్న స్వల్ప అంతరాయాన్ని త్వరలోనే అధికమిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక సరఫరా కొనసాగుతుందన్నారు. బుధవారం నాటికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,76,958 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. మంగళవారం 13,011 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1027 ధరఖాస్తులు అందాయన్నారు. మంగళవారం ధరఖాస్తు చేసుకున్న 1,027 ధరఖాస్తుదారులతో పాటు, పెండింగ్ లో ఉన్న 202 ధరఖాస్తుదారులకు 3,356 మెట్రిక్ టన్నుల ఇసుక, మొత్తంగా 1,229 ధరఖాస్తుదారులకు 16,367 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామన్నారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *