Breaking News

Tag Archives: machilipatna

జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్ష

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని హౌసింగ్ అధికారులు సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం వేగం పెంచాలన్నారు. వివిధ నిర్మాణాల దశల్లో స్టేజ్ కన్వర్షన్ పురోగతి సాధించాలన్నారు. వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఉయ్యూరు, ఘంటసాల, పెడన వంటి మండలాల్లో పెద్దగా పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లింపులు …

Read More »

అనాధ పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని పిల్లల సంరక్షణ సంస్థల్లో (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) రక్షణ పొందుతున్న పిల్లలందరినీ జువైనల్ జస్టిస్ చట్టం పరిధిలోకి తప్పనిసరిగా తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో అనాధ పిల్లల సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనాధ పిల్లలను, పిల్లల సంక్షేమ కమిటీ (సి డబ్ల్యూ సి) ద్వారా లీగల్లీ ఫ్రీ ఫర్ …

Read More »

మాన్యువల్ పద్ధతిలోనే ఇసుక తవ్వకాలు

-జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి అనుమతులు లేవు -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఇసుక తవ్వకాలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలని, తవ్వకాలకు జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాహన రవాణాదారులకు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇసుక తవ్వకాలపై రవాణాదారులతో సమావేశమై పలు …

Read More »

కొత్త ఇసుక రీచ్ లను గుర్తించండి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఇసుకను సమృద్ధిగా అందుబాటులో ఉంచేందుకు జిల్లాలో కొత్త ఇసుక రీచ్ లను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మైనింగ్, రవాణా, పోలీసు, భూగర్భ జల, పోర్టు తదితర అధికారులతో ఉచిత ఇసుక విధానంపై సమీక్షించారు. అదే సమయంలో ఆయన ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …

Read More »

ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం

-మంత్రి కొల్లు రవీంద్ర పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన, నేటి పత్రిక ప్రజావార్త : ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి జి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ యం. వాణిలతో కలిసి మీకోసం- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి …

Read More »

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను కట్టుదిట్టంగా భద్రపరచాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను కట్టుదిట్టంగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ గోదాముకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉందా లేదా గమనించారు. అలాగే గోదాములో పార్లమెంటు నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలను …

Read More »

ఉదారత చాటుకున్న యోగాసభ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ కుమారుని చదువు కోసం ఏపీ యోగా సభ, మచిలీపట్నం తరపున యోగ సభ్యులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం ఉదయం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో యోగా ఉచిత శిక్షణ అనంతరం యోగ గురువులు గురునాథ బాబు, చింతయ్య రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ గొరిపర్తి సారధికి ఇంటర్ చదువుతున్న అతని కుమారుని చదువు కోసం ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ తరపున 10 వేల …

Read More »

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి సహకరించిన టీం కృష్ణా కు అభినందనలు

-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు, సిబ్బంది టీం స్పిరిట్ తో పనిచేశారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రశంసించారు. 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందన సభ శుక్రవారం జడ్పీ కన్వెన్షన్ హాల్లో జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా, రీపోలింగ్ లేకుండా ఎంతో సమర్థవంతంగా …

Read More »

కృష్ణా జిల్లా లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వారు తొలుత జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి అద్నాన్ నయీమ్ అస్మి, సంయుక్త కలెక్టర్ గన్నవరం రిటర్నింగ్ అధికారి గీతాంజలి శర్మలతో కలిసి విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ భవనంలోని మచిలీపట్నం, గుడివాడ, పెడన, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం, పెనమలూరు శాసనసభ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు …

Read More »