Breaking News

స్వచ్చంధ సేవా సంస్థలు వివిధ ప్రతులతో ప్రతిపాదనలను అంద చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా నందు ఉన్న స్వచ్చంధ సేవా సంస్థలకు (ప్రతేక్య అవసరాలు గల పిల్లల కోసం నడప బడుచున్న నిర్వాహకులకు) తెలియచేయడం ఏమనగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యములో ఉన్నటువంటి బాల సదనం, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా ప్రతేక్య అవసరాలు గల బాలికల కోసం మంజూరు చేయటం జరిగినది. కావున ప్రతేక్య అవసరాలు గల పిల్లల ఆలనా పాలనా చేసుకొనుటకు మరియు హోమ్ ను నిర్వహించడానికి అనుభవము మరియు ఆసక్తి గల స్వచ్చంధ సంస్థలు నుండి ప్రతిపాదనలు ఆహ్వానించడ మైనది. కావున జిల్లా యందలి ప్రతేక్య అవసరాలు గల బాలల సంరక్షణలో అనుభవము ఉన్న స్వచ్చంధ సంస్థలు తమ స్వచ్చంధ సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మూడు సంవత్సరముల అడిట్ రిపోర్ట్స్, మరియు సంస్థ యొక్క వివిధ ప్రతులతో ప్రతిపాదనలను జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షమే మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము, బి – బ్లాక్, రూమ్ నెంబర్ – 505 & 506, పద్మావతి నిలయం, కలెక్టరేట్, తిరుపతి 24.05.2025 తేదీ సాయంత్రం 05.00 గం.ల లోపు అంద చేయవలసినిదిగా కోరుచున్నాము.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *