-జిల్లావ్యాప్తంగా 7 లక్షల 50 వేల మంది పేర్లు నమోదు
-నగరంలో పది ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమం
-జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ , సచివాలయ , ప్రముఖ కూడళ్లలో మాస్ యోగా సాధన
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని అదే క్రమంలో జిల్లా స్థాయిలో 8 లక్షల మందితో యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాస్థాయిలోని అధికారుల నుంచి గ్రామస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని యోగాంధ్రా కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 14 తేదీన ట్రయల్ రన్ కు సంబంధించిన యోగాంద్రా సాధన కోసం సర్వత్రా సిద్ధం కావాలని, డ్రెస్ కోడ్ పాటిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించడం పై నియోజవర్గ మండల స్పెషల్ ఆఫీసర్లు మండల అధికారులు జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. శనివారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు జల వ్యాపారం జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాలలో యోగా సాధన నిర్ణీత సమయంలో ప్రారంభించి వాటిని రికార్డు చేయడంతో పాటు ఫోటోలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు.
కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జూన్ 21న నిర్వహించే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు శాసనసభ్యులు అధికారులు ఆయా నియోజకవర్గాల పరిధిలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏడు లక్షల 71 వేల మంది పేర్లు యోగాంధ్రా కార్యక్రమంలో నమోదు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7, 52 వేల మంది పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ పరిధిలోనీ వివరాలు అర్బన్ కింద నమోదు అయినట్లు తెలియ చేశారు.
రాజమండ్రి నగరం పరిసర ప్రాంతాల్లో 10 ప్రాంతాలను యోగా సాధన కోసం వివిధ ప్రభుత్వ విభాగాల శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం , ఆమేరకు వెన్యూ (ప్రదేశాల ను గుర్తించినట్లు తెలిపారు. వాటి వివరాలు…
ఆర్ట్స్ కళాశాల దగ్గర G.N.T రోడ్డు – పాఠశాల విద్య విభాగం & కళాశాల విద్య ..
గౌతమి ఘాట్ – పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ..
సరస్వతి ఘాట్ – ఉద్యానవన శాఖ. సెరి సంస్కృతి & వ్యవసాయ సాంస్కృతిక శాఖ ….
కొత్త పుష్కర్ ఘాట్ (లోపల) – మత్స్య శాఖ
చింతాలమ్మ ఘాట్ శివుని విగ్రహం వద్ద – పరిశ్రమల శాఖ
సుబ్రహ్మణ్య మైదానం – పోలీసు శాఖ, సైనిక్ సంక్షేమ శాఖ
దానవాయిపేట ఎంపీఎల్. కార్పొరేషన్ హై స్కూల్ –
రవాణా శాఖ
ఎ.కె.సి. కాలేజ్ రోడ్ – వైద్య & ఆరోగ్య శాఖ & GGH, RJVM & IMA
లాలాచెరువు బి.టి. రోడ్డు సమీపంలో సూర్య నమస్కారం విగ్రహాలు – ఆయుష్ శాఖ
క్వారీ మార్కెట్, శివాలయం ఎదురుగా – జిల్లా క్రీడా అభివృద్ధి మరియు SAAP
Prajavartha Online Telugu News