Breaking News

న్యాయ విజ్ఞాన సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ స్థానిక సీతంపేట లో ఉన్న శ్రీ పంతం సత్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ నందు మంచి, చెడు స్పర్శల గురించి మరియు “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం, 2024 ” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ . శ్రీ లక్ష్మీ విద్యార్ధులతో మాట్లాడారు. విద్యార్ధులు చదువు పై ఆసక్తి కలిగి ఉండాలని, నిరంతరం వివిధ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. పిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంత మంది వారి పై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మోసపూరితంగా వారిని అక్రమ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని తెలిపారు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఎవ్వరూ పిల్లల పట్ల హద్దులు దాటి ప్రవర్తించరాదని అన్నారు. వారికి మంచి, చెడు స్పర్శల గురించి వివరించారు. “బాల్య వివాహ నిషేధ చట్టం, 2006”, “బాల కార్మిక నిర్మూలన చట్టం, 1986” మొదలగు చట్టాల పై అవగాహన కల్పించారు. “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం, 2024 ” ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిల్లలకు అందిస్తున్న న్యాయ సేవల గురించి తెలిపారు. పిల్లలకు ఎలాంటి న్యాయ సమస్యలు ఎదురైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనంను పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *