Breaking News

ఐటిఐ కోర్సులలో అడ్మిషన్స్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2026-27 విద్యా సంవత్సరమునకు గాను ఐటిఐ కోర్సులలో అడ్మిషన్స్ పొందుటకు ఎన్ టి ఆర్ జిల్లాలో గల ప్రభుత్వ ఐటిఐ మరియు ప్రైవేట్ ఐటిఐ లలో సీట్ల భర్తీ చేయుటకు గాను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటిఐ విజయవాడ ప్రధానాధికారి మరియు కన్వీనర్ ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు మరియు 8 తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని అయన తెలిపారు.
ప్రభుత్వ ఐటిఐ మరియు ప్రైవేట్ ఐటిఐ లలో చేరగోరు అభ్యర్థులు itiadmissions.ap.gov.in/iti ద్వారా గాని ప్రభుత్వ ఐటిఐ ద్వారా గానీ తేదీ 30-06-2026 సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను పూర్తి చేసుకొనగలరని ఎం. కనకారావు, ప్రధానాధికారి మరియు కన్వీనర్, ప్రభుత్వ ఐటిఐ విజయవాడ వారు తెలియజేయుచున్నారు. మరియు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తేదీ 02-07-2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ ఒరిజినల్ సర్టిఫికట్స్ తీసుకువచ్చి వెరిఫికేషన్ పూర్తి చేసుకొనవలెనని ఆయన సూచించారు.
అభ్యర్థులకు అడ్మిషన్ దరఖాస్తు చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ విజయవాడ నందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని కావున ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
మరిన్ని వివరాలకు జిల్లా కన్వీనర్ కార్యాలయం గవర్నమెంట్ ఐటిఐ విజయవాడ నందు సెల్ నెంబర్ 94906 39639 లో సంప్రదించవలెనని ఆయన సూచించారు.
అభ్యర్థులకు ఆయన తెలియజేయునది ఏమనగా ఆన్ లైన్ లో వివరాలు పూర్తి చేసినపుడు ఎటువంటి తప్పులు దొర్లకుండా చేయాలన్నారు. కౌన్సిలింగ్ సమయం నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయునపుడు అభ్యర్థి యొక్క దరఖాస్తు వివరములు సక్రమంగా లేని ఎడల అడ్మిషన్ పొందుటకు అనర్హులుగా దృవీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
కావున 2026-27 విద్యా సంవత్సరమునకు ఐటిఐ కోర్సు లలో అడ్మిషన్ పొందుటకు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు చేసుకోవాలని ఎం. కనకా రావు ప్రధానాధికారి మరియు కన్వీనర్, ప్రభుత్వ ఐటిఐ విజయవాడ వారు తమ ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *