Breaking News

బీసీ సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక వాటాలు దక్కాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఆర్థిక వాటాలు దక్కాలని రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు అంగడాల పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, వారికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారంలో “మేమెంతో మాకంత” అనే నినాదంతో తమ వాటా కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్‌లో గురువారం ప్రారంభమైన రెండు రోజుల బీసీ ప్రతినిధుల సమావేశంలో భాగంగా గురువారం మొదటి రోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి రెడ్డి బాబు, అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెస్ ఆదినారాయణ బోయ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డి సుభాని,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు. రాంబాబు, పలు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమన్వయ కమిటీ అధ్యక్షులు అంగడాల పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ 76 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, వారికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం పైబడి ఉన్న బీసీలకు శాసనసభ, పార్లమెంటుతో పాటు రాష్ట్ర సంపదలోనూ సమాన వాటా ఇవ్వాలన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రి ఉండాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల్లో ఉన్న బీసీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తమ ఓటును తామే వేసుకుని, తమ రాజ్యాన్ని తామే ఏలుకునేలా బీసీ ఓటర్లను చైతన్య పరుస్తామన్నారు. ఇది రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ మార్పును తీసుకువచ్చేందుకు ఒక సమన్వయ శక్తిగా పనిచేస్తుందన్నారు. ఈ రెండు రోజుల చర్చల అనంతరం శుక్రవారం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ జిల్లాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *