Breaking News

న్యాయమిత్ర అకాడమీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయ మిత్ర అకాడమీ వ్యవస్థాపకులు పొత్తూరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక యం.బి.వి.కె భవన్ లో అనుభవజ్ఞులై న న్యాయమూర్తులతో భవిష్యత్తులో ప్రస్తుత న్యాయవాదులు భవిష్యత్తు లో న్యాయమూర్తులగా అవ్వడానికి ఎటువంటి శిక్షణ పొందాలో న్యాయవాదులకు అవగాహన కల్పించే సదస్సును నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా నియమింపబడ్డ న్యాయమూర్తులు , న్యాయవాదులు అడిగిన సందేహాలను అనుభవజ్ఞులై న్యాయమూర్తులు నివృత్తి చేయడమే కాకుండా భవిష్యత్తు లో క్లిష్టమైన కేసులలో వచ్చే సందేహలకూ పరిష్కారాలకు తగు సూచనలు సలహాలు ఇవ్వడమే ఈ అవగాహన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధులు బార్ కౌన్సిల్ మెంబర్స్ సుంకర రాజేంద్రప్రసాద్ , యస్. మల్లేశ్వరరావు , జె.సి.జె విన్నర్స్ రాఘవేంద్ర టి, నందిని జె , సుభాన్ బి, సుయెధన్. టి , గాయత్రీ యన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *