Breaking News

ఉపాధి హామీ ద్వారా లక్ష్యా సాధనకు అనుగుణంగా పనిదినాలు కల్పించాల్సి ఉంది…

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్ పూర్తి అవుతున్న నేపథ్యలో ఉపాధి హామీ ద్వారా లక్ష్యా సాధనకు అనుగుణంగా పనిదినాలు కల్పించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం దేవరపల్లి మండలంలోని దుమంతునిగుడెం – ధర్మచెరువు లో ఉపాధిహామీ పనుల ను క్షేత్ర స్థాయి లో పరిశీలించి, ఉపాధిహామీ పథకం కార్మికులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధి ని గ్రామ ప్రజల భాగస్వామ్యం తో చేసుకో గలుగుతామన్నరు. ఉపాధి హామీ పనులకు చెందిన వేతనం నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి లోని డ్వామా ఫీల్డ్ సిబ్బంది ఉపాధి హామీ జాబ్ కార్డ్ దారుల బ్యాంక్ ఖాతా నెంబరు లను సక్రమంగా డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. మండలానికి ఏడు వేల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటి వరకు 5,566 మండడిటీస్ కోసంఅంచనాకు వొచ్చినట్లు తెలిపారు. మొత్తం 612 మందికి జాబ్ కార్డ్ జారీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకూ 51 శాతం 3586 మాత్రమే లక్ష్యాలను చేరుకోవడం జరిగిందన్నారు. మిగిలిన లక్ష్యాలను సాధించడానికి తగిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వారం వారం లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి ప్రతిపాదన లను నాలుగు రోజులు ముందుగా ఆన్లైన్ లో అప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారు.

దేవరపల్లి పి.హెచ్. సి. తనిఖీ
దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డా. కె. మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డుల ను పరిశీలించారు. అసుపత్రికి వొచ్చే రోగుల సంఖ్య, వారికి అందిస్తున్న సేవలు, వారికి అంద చేస్తున్న మందుల వివరాలను, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. పి హెచ్ సి లకు తక్షణ వైద్య సేవలు కోసం ప్రజలు వస్తారని వారి సమస్య విని సానుకూలంగా స్పందించాలని పేర్కొన్నారు. సిబ్బంది హాజరు వివరాలు, స్టాక్ వివరాలకు చెందిన రిజిస్టర్ లను పరిశీలించి తగిన సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి కి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న దృష్ట్యా మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డ్వామా ఇంఛార్జి పిడి పి జగదాంబ, తహశీల్దార్ ఎం. రామకృష్ణ, ఎంపీడీఓ ఉమామహేశ్వర రావు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *