Breaking News

శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం…

కొల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొల్లూరు లంక ప్రాంతాలలో పేదప్రజలకు ఉచితవైద్య శిబిరంవలన దీర్ఘకాలిక వ్యాదులను గుర్తించి మెరుగైన వైద్యసేవలు తీసుకొవచ్చాని ఈపూరు లంక గ్రామసర్పంచ్ మేకతోటి శ్రీకాంత్ అన్నారు. సోమవారం కొల్లూరు మండలం ఈపూరులంక గ్రామంనందు తెనాలి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ డాక్టర్ల సేవలు ఆభినందనీయమన్నారు. అర్దోపేడిక్ డాక్టర్ కమ్మెల హరీష్ మాట్లాడుతూ శ్రీచక్ర హస్పటల్ నందు కార్పొరేట్ వైద్య సేవలను అతితక్కువ ఖర్చుతో 24గంటలు అందిస్తామన్నారు. క్రిటకల్ కేర్, అత్యవసర సేవలు, పాముకాటు, ఫాయిజన్ కేసులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ కె.మిధునేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హస్పటల్ నందు ఊపిరితిత్తులకు అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు ఉచిత అందజేశారు. ఈశిబిరంలో డాక్టర్లు ప్రియాంక కమ్మెల, పి.అపూర్వ, మానస సింగరాజు వైద్యసేవలు అందజేశారు. శ్రీనివాసరరావు కమ్మెల, జిల్లా ఏలాక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్అసోసియేషన్ ఆద్యక్షులు కె.సునీల్ సందీప్, మార్కంఢేయులు, కంకిపాటి.రమేష్ కుమార్, హస్పటల్ సిబ్బంది, ఈపూరులంక సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *