Breaking News

జూలై 5 న జరిగే బందును విజయవంతం చేయండి… : షేక్ జలీల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం హక్కుల కోసం జులై 5న జరిగే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం హక్కులను కాలరాస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షేక్ లు , సయ్యద్ లు , పఠాన్ లు , నూర్ బాషా ల అందరూ ఒక్కటై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా జులై 15వ తేదీన ‘ఆంధ్రప్రదేశ్ బంద్” నిర్వహించుటకు నిర్ణయం అయినది కావున అన్యాయానికి గురైన ఇతర యస్సీ , యస్టీ , బిసి కుల సంఘాలు కూడా పాల్గొని ఈ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ లో ఉన్న నిధులు , ఉర్దూ అకాడమీ, హజ్ హౌస్ లు అన్యాక్రాంతం అయిన వక్ఫ్ బోర్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేద ముస్లిం లకు ఇళ్ళ స్థలాలు కేటాయించకపోవడం మైనార్టీ ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్నట్టే అని అందుకే రాష్ట్ర ముస్లిం సంఘాలంతా కలిసికట్టుగా పిలుపునిచ్చిన జులై 15 న జరిగే రాష్ట్ర బంద్ కు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిధ్దం చేసి నేషనల్ హైవే రోడ్లను దిగ్బంధం చేసైనా బంద్ ను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ముస్లింలు ఎంతో అభివృద్ధి చెందుతారని మేమంతా ఆశపడ్ఠామని మా ఆశలకు నీళ్ళు జల్లిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలలో ముస్లిం హక్కులను విస్మరించారని , ముస్లింల అభివృద్ధి అడ్డుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదు అని , గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేద ముస్లిం యువతుల వివాహం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దుల్హన్ పథకం నేడు పథకానికి డబ్బులు లేవని మరి ఆ పథకం రద్దు చేయడం ముస్లింలకు పేద మహిళ యువతులకు తీవ్ర అన్యాయం చేయాడమే అని జలీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు దుల్హన్ పథకానికి గత తెదేపా ప్రభుత్వం 50 వేల రూపాయలు ఇస్తే మా గవర్నమెంట్ వస్తే లక్ష రూపాయలు చేస్తామని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు డబ్బు లేదని వంకతో మైనార్టీ మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం పెద్దలతో చర్చలు జరిపి మాకు హక్కులకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించి తగు న్యాయం చేయాలని లేదా మీరు ముస్లింలకు న్యాయం చేయడంలో వెనుకంజ వేసినట్లయితే జులై 5 వరకు వేచి చూస్తామని లేని పక్షంలో మేము నిర్వహించే బందు ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అన్ని కులాలకు , అన్ని మతాలకు, సమాన దృష్టితో చూస్తానని నమ్మబలికి నేడు మమ్మల్ని అభివృద్ధి పరచడంలో విఫలం అవుతున్నారని కావున మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని తగిన న్యాయం చేయగలరని బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నామని షేక్ జలీల్ తెలిపారు. ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *