Breaking News

190 వార్డ్ వాలంటీర్ల అభ్య ర్ధుల ఎంపిక…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 5వ దశ, 190 వార్డ్ వాలంటీర్ల అభ్య ర్ధుల ఎంపికకై గాంధీజీ మునిసిపల్ హై స్కూ ల్, వన్ టౌన్ నందు ది.22.07.2022న ఉదయం గం.10.00 ల నుండి సాయంత్రం గం.05.00ల వరకు ఇంటర్వ్లు నిర్వ హించబడునని కమిషనరు, విజయవాడ నగరపాలక సంస్థ వారు తెలియజేసియున్నారు. అభ్యర్ధులు గాంధీజీ మునిసిపల్ హై స్కూల్, వన్ టౌన్ నందు మౌఖిక పరీక్షకు అన్ని సర్టిఫికేట్లతో హాజరు కావలసినదిగా కోరడమయినది. ఇతర వివరముల కొరకు స్పె షల్ ఆఫీసర్ (వార్డ్ సెక్రటరియట్స్) లేదా వార్డు సెక్రటేరియట్ స్పె షల్ సెల్, విజయవాడ నగరపాలక సంస్థ, ఫోన్ నెం.8185933187 కు సంప్రదించవచ్చును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *