Breaking News

ఖద్దరు దుస్తులు ధరించి స్వాతంత్య్ర స్పూర్తిని నింపుద్దాం…

-మొబైల్స్‌ వాట్సాప్‌ లో ప్రొఫైల్‌ పిక్‌గా జాతీయ పతాకాన్ని ఉంచండి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అధికారులు ఉద్యోగులు ఖద్దరు దుస్తులు ధరించాలని మొబైల్స్‌లో వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా జాతీయ పతాకాన్ని ఉంచి ప్రజలలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌ స్పందన సమావేశం మందిరంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆగస్టు 2న పింగళి వెంకయ్య ,బళ్లారి రాఘవ ల జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. త్రివర్ణ పతాకానికి ఆగస్టు 2వ తేదీకి అభినాభవ సంబంధం ఉందన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినమైన ఆగస్టు రెండవ తేదీన జాతయ పతాకాన్ని గుర్తించి చర్చించుకునే పరిణామం చోటు చేసుకోవడం ఆనందదాయకమన్నారు. స్వర్గీయ పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల ఆత్మగౌరవానికి పతీకగా నిలిచిందన్నారు. విజయవాడలో నేడు బాపు మ్యుజియంగా పిలవబడుతున్న విక్టోరియా జూబిలి మహాల్‌ సమావేశ మందిరంలో 1921 మార్చి 31వ తేదీన మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయన్నారు. సమావేశంలో మహాత్మాగాంధీ పింగళి వెంకయ్య తో మాట్లాడి జాతీయ జెండా రూపకల్పన భాధ్యతను అప్పగించారన్నారు. బాధ్యత అప్పగించిన 3 గంటల వ్యవధిలో జాతీయన జెండా నమూనను అప్పగించరన్నారు. ఆ తరువాత గాంధీజీ చేసిన పలు సూచనలను పరిగణంలోకి తీసుకుని ఎరుపు, ఆకుపచ్చ తెలుపు రంగుల మధ్య రాట్నం గుర్తుతో జాతీయ పతాకాన్ని తయారు చేశారన్నారు. అనంతరం జవహర్‌ లాల్‌ నెహ్రూ మౌలనా అబుల్‌ కలాం అజాద్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య తారాసింగ్‌ దత్తాత్రేయ బాలకృష్ణలతో కూడిన కమిటి సూచనల ప్రకారం కాషాయం, ఆకుపచ్చ తెలుపు రంగులతో పతాకంపై రాట్నం ఉండేలా మార్పులు చేసిన జాతీయ పతాకాన్ని అమోదించడం జరిగిందన్నారు. జాతీయ పతాక రూపకర్త కృష్ణాజిల్లాకు చెందిన వారు కావడడంతోపాటు ఎన్‌టిఆర్‌ జిల్లాలోని విజయవాడ నగరంలో జాతీయ పతాకానికి పునాది వేయడం మన అందరికి గర్వకారణం అన్నారు. స్వాతంత్య్ర ఉద్యామానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఎన్‌టిఆర్‌ జిల్లాలో హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంత చేయడం ద్వారా స్వాతంత్య్ర స్పూర్తిని తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, ఉద్యోగులు నేటి నుండి ఖద్దరు దుస్తులను ధరించి విధులను నిర్వర్తిచడం ద్వారా ప్రజలను హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం పట్ల చైతన్యవంతులు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళివెంకయ్య మరియు బళ్లారి రాఘవ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతో పాటు 3వ తేదిన స్వర్గీయ కాకాని వెంకటరత్నం జయంతి ఉత్సవాలను 4వ తేదిన పాఠశాల, కళాశాల, యూనివర్సిటిల విద్యార్థులకు గేయ పోటీలను నిర్వహించాలన్నారు. 5వ తేదీన దేశభక్తి పై నాటక, ఏకపాత్రాభినయం పోటీలను 6వ తేదీన స్వాతంత్య్ర సమరానికి చెందిన చాయ చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ల. 7వ తేదిన విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీలను 8వ తేదీన విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్‌, పెయింటింగ్‌, వ్యాసరచన, పోటీలను 9వ తేదీన దేశభక్తిని ఇనుమడిరప చేసేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలను 10వ తేదిన మాజీ రాష్ట్రపత్రి వివి గిరి జన్మదిన వేడుకలను నిర్వహించి 11వ తేదీన వారసత్వసంపదలకు సంబంధించిన వాటిపై నడక పోటీలు 12వ తేదీన క్రీడలపై పోటీలను 13వ తేదిన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ సెల్ఫీ పోటోలను దిగేవిధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని 14వ తేదీన స్వాతంత్య్ర సమరయోధుల గృహలను సందర్శించి సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకంతో పాదయాత్ర నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. అనంతరం ఖద్దరు దుస్తులను ధరించిన జిల్లా అధికారులతో కలెక్టర్‌ డిల్లీరావు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌ గ్రూపు ఫోటోలు తీసుకున్నారు.
సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డ్వామా పిడి జె. సునీత, ఐసిడిసి పిడి జి. ఉమాదేవి, డిఇవో సి.వి. రేణుక, డిఎస్‌వో కోమలి పద్మ, ఎస్సీ వెల్ఫెర్‌ డిప్యూటి డైరెక్టర్‌ విజయభారతి, బిసి వెల్ఫెర్‌ డిప్యూటి డైరెక్టర్‌ సిహెచ్‌ లక్ష్మి దుర్గ, ఛీప్‌ ప్లానిగ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఆర్‌ రత్నరూత్‌, జిల్లా వ్యవసాయ అధికారిణి యం విజయభారతి, హౌసింగ్‌ పిడి వి.శ్రీదేవి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పి వి రమేష్‌కుమార్‌, ఉద్యాన అధికారి బాలజీ కుమార్‌, జిల్లా ఖజానా అధికారి రెహమాన్‌, సర్వే ఎడి కె. సూర్యరావు, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *