Breaking News

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అధికారులు ప్రజల వద్దకు వస్తున్నారు…

-రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.హాగన్మోహన్ రెడ్డి  చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం తో ఇది సాధ్యం అయింది
-ఈరోజు స్పందనలో 138 ఫిర్యాదులు అందాయి
-హోం మంత్రి డా.తానేటి వనిత
-జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తానేటీ వనిత పేర్కొన్నారు. సోమవారం కొవ్వూరు  పురపాలక సంఘ కార్యాలయపు సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్ . శ్రీధర్, జిల్లా అధికారులతో కలిసి  రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత స్పందన అర్జీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి డా. తానేటి వనిత  మాట్లాడుతూ ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోరకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావడం జరిగిందన్నారు. అహర్నిశలు శ్రమిస్తు ప్రజా సమస్యలు పరిష్కారం చేసి వారి జీవితాల్లో వెలుగు నింపడనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన లక్ష్యమన్నారు. అర్హత బట్టి ప్రాంత, కుల, రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. ఆ దిశలోనే అధికారులు కూడా నియోజకవర్గం పరిధిలో నే స్పందన కార్యక్రమం చేపట్టి ప్రజలు సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతోందన్నారు. ఆ దిశలో ఈరోజు కొవ్వూరు లో స్పందన కార్యక్రమం నిర్వహించు కోవడం , జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు రావడం జరిగిందన్నారు.

కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్న విషయం తెలియ చెయ్యడానికి నియోజక వర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టామన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు దగ్గరయ్యే దిశలో నియోజకవర్గాల వారి  స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.   ప్రజల సమస్యలు పరిష్కారం కోసం స్థానిక మంత్రులు, శాసన సభ్యులు, మండల అధికారులు సమక్షం లో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తు పరిష్కారం చేస్తున్నామన్నారు.  ఫిర్యాదులపై స్థానికంగా పరిష్కారం సాధ్యం అవుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత  స్పందనలో ఉద్యోగ, ఉపాధి, ఫించన్లు, గృహం మంజూరు, భూ వివాదాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించా మన్నారు. మొత్తం 700 మంది ఈరోజు స్పందనకు రాగా వారు మొత్తం 138 అర్జీలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు కొన్ని సమస్యల పరిష్కారం కోసం అధికారులను క్షేత్ర స్థాయి తనిఖీకి ఆదేశించామన్నారు.

పలు స్పందన అర్జీలు :-
కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామ నివాసి కొండా నవీన్ తనకు 22 సంవత్సరాలని చిన్న మెదడు సరిగా పని చేయక పోవడం తో మానసిక స్థితి బాగుండలేదు. దివ్యాంగుల పింఛను కొరకు సదరన్ సర్టిఫికెట్ కావలసి వున్నందున పలుమార్లు ఏలూరు ప్రధాన ఆసుపత్రికి దరఖాస్తు చేసినా మంజూరు చెయ్యలేదు. కావున సదరన్ సర్టిఫికెట్ మంజూరు కోరుతూ దరఖాస్తులో పేర్కొన్నారు.

ఈ అంశంపై కలెక్టర్ స్పందిస్తూ వారి అర్హతను పరిశీలించి వెంటనే సదరన్ సర్టిఫికెట్ మంజూరు చేయ్యాలని డిసిహెచ్ఓ డా. సనత్ కుమారిని ఆదేశించారు.

చాగల్లు మండలానికి చెందిన రైతు మేకా సుబ్బారావు తమ అర్జీలో గత 20 ఏళ్లుగా సాగు చేస్తున్నాను. గత పంట ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం లో విక్రయించగా ధాన్యం తాలూకా సొమ్ము ఇంతవరకు నా బాంక్ అకౌంట్ కు జమ కాలేదు. కావున ధాన్యం సొమ్ము నా అకౌంట్ కు జమ చేసి, కౌలు అర్హత దృవీకరపత్రం అందజేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ రైతు ఖాతాలో ధాన్యం సొమ్ము జమ అయ్యేవిధంగా తగు చర్యలు చేపట్టాలని డీఎం పౌరసరఫరాలు అధికారిని ఆదేశించారు.

పసివేదల గ్రామానికి చెందిన కాకరపల్లి పద్మావతి తమ అర్జీలో నేను వై ఎస్ ఆర్ చేయూత పథకానికి అర్హురాలైనప్పటి కి గత మూడేళ్లుగా చేయూత పథకం అందడం లేదని కోరారు.

పంగిడి గ్రామానికి చెందిన కాశింసెట్టి సాయిగీత తమ అర్జీలో తన కుమారునికి వికలాంగుల పెన్షన్ మంజూరు అయి గుర్తింపు కార్డు. ఇచ్చియున్నారు.కానీ పెన్షన్ మాత్రం ఇవ్వడం లేదు. దివ్యాంగుడైన తన కుమారునికి పెన్షన్ ఇవ్వాలని వారు అర్జీలో కోరారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ బావన రత్న కుమారి, జిల్లా అధికారులు, ఆర్డీఓ / ఇంఛార్జి మున్సిపల్ కమీషనర్ ఎస్.మల్లిబాబు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, డ్వామా పిడి జీ ఎస్ రాజ్ గోపాల్, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీఎమ్ పౌరసరఫరాలు తనుజ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి  ఎస్.మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి రాధాకృష్ణ, జిల్లా హౌసింగ్ అధికారి టి.తారచంద్, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వర రావు, డిఎస్ఓ ప్రసాదరావు, డీఈవో ఎస్. అబ్రహం, డిఎమ్ హెచ్ ఓ డా. ఎన్. వసుందర, డిసిహెచ్ఓ డా. సనత్ కుమారి,డిఆర్ డి ఏ పిడి డేగలయ్య, కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాలకు చెందిన తాహసిల్దార్లు, ఎంపిడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *