Breaking News

స్పందనలో 22 ఫిర్యాదులు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 22 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  ఏ డి సి  పి ఎం సత్య వేణి, ఎస్సీ జి  పాండురంగారావు, ఇతర  అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
అనంతరం కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వొచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సచివాలయ సిబ్బంది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పౌర సేవలు అందించే క్రమంలో పనితీరులో ప్రగతి సాధించాక పోవడం పై కమిషనర్ వివరణ కోరారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పలు మార్లు సూచించడం జరిగిందని, అయినా కొన్ని వార్డు సచివాలయాల్లో తెలిపారు.  సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తత అవసరం అని దినేష్ కుమార్ పేర్కొన్నారు. పారిశుధ్య పనుల విషయంలో వార్డు వాలంటీర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందచేయ్యాల్సి ఉంటుందన్నారు. వార్డు ల్లోని సమస్యలపై క్షేత్ర స్థాయి సిబ్బంది అధికారులు స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడం తో పాటు వాటికి తాగిన పరిష్కారం కూడా చూపాల్సి ఉంటుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *