కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
జాతిపిత మహాత్మా గాంధీ “నా జీవితమే – నా సందేశం” అని పేర్కొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం గాంధీజీ జయంతి సందర్భంగా కొవ్వూరు విజయ విహార్, మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతిపీత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించిన శాంతి దూతగా ప్రపంచానికే ఆదర్శం గా నిలిచారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ సామ్రాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేసి నేటి ఆధునిక రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News