Breaking News

ఇంటింటి త్రాగు నీరు వ్యవస్థ కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్ప లో భాగంగా 300 గ్రామ పంచాయతీ ల్లో 214 గ్రామాల్లో పూర్తి చేశామని, వొచ్చే వారానికి 8పంచాయతీ లను లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ఉపాధిహామీ, ప్రాధాన్యత భవనాలు, జె ఎస్ ఎస్, తదితర అంశాలపై అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా 26 లక్షల పని దినాలకు గానూ, 33.040లక్షల పని దినాలు సాధించామన్నరు. కనీస రోజు వారి వేతనం రు.217.42లు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 290 గ్రామ సచివాలయం భవనాలు, 217 అర్భికెలు, 149వై ఎస్ ఆర్ హెల్త్ భవనాలు పూర్తి చేసి నట్లు తెలిపారు. జిల్లాలో 9516జగనన్న కాలనీల్లో 53,190 ఇళ్లకు. ఇంటింటి త్రాగు నీరు వ్యవస్థ కోసం కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ జీ. రామ్ గోపాల్, డిపివో పి. జగదాంబ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *