రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం హైదరాబాదు లో నిర్వహించిన 15త్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులనుజిల్లా కలెక్టర్ కే. మాధవీలత అభినందించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో విజేతలు, కోచ్ లు కలెక్టర్ ను కలిసి, వారు సాధించిన పతకాలను చూపించడం జరిగింది. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం అవసరం అన్నారు. తల్లి తండ్రులు, ఉపాధ్యాయలు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎస్ కే ఆర్ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నెహ్రు నగర్ స్కూల్ బివియమ్ ఈ విద్యార్థినీ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారని కోచ్ లు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఏ వెంకట కావ్య శ్రీ, ఏ అలేఖ్య, బి కీర్తన,ఎస్ నాగేశ్వరి, కె లక్ష్మి భవాని, జి లక్ష్మీ సంధ్య, ఎన్ శ్రీ లక్ష్మీ లత, పి.శ్రీవిద్య స్వాతి లక్ష్మీదేవి, ఆర్ అఖిల, పి పూజ, డి సిద్దు, పి విజయకుమార్, డి సాయి కిరణ్, సిహెచ్ సాయి ప్రతాప్, పి వెంకట చరన్, సిల్వర్ మెడల్ సాధించినవారు. సిహెచ్ మోక్షిత యాదవ్, వి వెంకట కిరణ్మయి, పీఏ లక్ష్మి, బి జస్వంత్, బి నిశాల్, మరియు బ్రాంచ్ మెడల్స్ సాధించిన పి శ్రీరామ్. మాస్టర్ పిల్లి అరుణ్ కుమార్, ఐఐటి కాలేజీ గణేష్ , మెగా జూనియర్ కాలేజ్ ప్రమోద్ అలాగే విద్యార్థిని , విద్యార్థులు ఉన్నారు.
Prajavartha Online Telugu News