Breaking News

ఫిష్ ఆంధ్రా.. ఫిట్ ఆంధ్రా .. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేపట్టాలి…

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మత్స్య పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల ప్రోత్సహించే దిశలో యూనిట్స్ స్థాపన, వాటిని అమలు చేస్తున్న విధానం పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్య శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం కు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో గత డి ఎల్ సి సందర్భంగా మంజూరీ కాబడిన యూనిట్స్ యొక్క ప్రస్తుత యదార్ధ స్థితి, వాటి పని తీరును తనిఖీ చేసి నివేదిక అందచేయాలని అన్నారు. జిల్లాలో మత్స్య సంపద కు అనుకూలమైన పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలు చేయడం తో పాటు మరిన్ని యూనిట్స్ ఏర్పాటుకు జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన యూనిట్స్ సరిగ్గా అమలు చేయబాడే లా చూసుకోవలసిన బాధ్యత సంబంధించి న అధికారులపై ఉందన్నారు. నూతన యూనిట్స్ స్థాపన కు ఆమోదం తెలిపిన వాటికి సంబంధించి రెండు వారాల్లో క్షేత్ర స్థాయి తనిఖీలు చేపట్ట వలసి ఉందని కలెక్టర్ అన్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్దం చెయ్యాలని జిల్లా మత్స్య అధికారిని ఆదేశించారు. హబ్ మోడల్ యూనిట్స్ స్థాపన చెయ్యడం తోపాటుగా వాటి ద్వారా సానుకూల ఫలితాలు కలిగేలా, విజయవంతం అయ్యేలా చూడడం ముఖ్యం అన్నారు.

స్థానికంగా చేపల వినియోగాన్ని పెంచడం, ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మినీ ఫిష్ రిటైల్ అవుట్‌లెట్‌లకు ప్రోత్సహం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. ఫిష్ ఆంధ్రా – ఫిట్ ఆంధ్ర ఫ్లాగ్‌షిప్” కార్యక్రమం కింద రాష్ట్రంలో డొస్టిక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించడంజరగాలని స్పష్టం చేశారు. ఈరోజు కమిటీ ముందుకు వచ్చిన ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలపడం జరిగింది. యూనిట్స్ స్థాపన కు బ్యాంకర్లు లబ్దిదారులు రుణాలు మంజూరు చేసి జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ది కోసం చేయూత గా నిలవాలని కోరారు.

జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణా రావు మాట్లాడుతూ,  ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం కింద యూనిట్స్ స్థాపన చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో రూ.916 లక్షలతో మత్స్యకారులకు యూనిట్స్ మంజూరు చేశామని, వాటిలో ప్రభుత్వ సబ్సిడీ ₹.507 లక్షలు లబ్దిదారుల వాటా ₹.408 లక్షలు ఉందని తెలియ చేశారు. గత డి ఎల్ సి లో ఇచ్చిన యూనిట్స్ పనితీరు ను తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ప్రణాళిక రూపొందిస్తా మన్నారు. జిల్లాలో ఫిష్ ట్యాంక్ లు, ఇతర అనుబంధ యూనిట్స్ స్థాపన కోసం 176 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 136 మార్గదర్శకాలు మేరకు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఫస్ట్ కం ఫస్ట్ విధానంలో యూనిట్స్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21, 21-22 సంవత్సరాలలో తొమ్మిది పథకాల కింద యూనిట్స్ ఏర్పాటు చేస్తుండగా, 2022-23 లో 12 పథకాలకు సంబంధించిన పరిపాలన ఆమోదం ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో, ఈ రంగంలో ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, రైతులతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ స్థాయి లో వచ్చిన ధరకాస్తు లను జిల్లా స్థాయి లో స్క్రూటిని చేసి తగిన సిఫార్సులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి వి. కృష్ణా రావు, ఎస్ ఈ ఇరిగేషన్ నరసింహ రావు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై. శ్రీనివాస్, లీడ్ బ్యాంకు అధికారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *