Breaking News

సోమవారం స్పందన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్ 7వ తేది సోమవారం ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని నగర కమిషనర్  కీర్తి చేకూరి IAS  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్పందన కార్యక్రమం కమీషనర్ ఛాంబర్ నందు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యల పై కమిషనర్ కి అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బేబీ కిట్లకు ఏ టారూ. 51.15 కోట్ల మంజూరు

-2.45 లక్షల మంది శిశువులకు ఉపయోగం -ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువుల కోసం -ఒక్కొక్క కిట్టు ధర రూ. 1,400.22 -మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *