Breaking News

లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పేదలందరికీ ఇళ్ళ పధకంలో లబ్దిదార్లు తమ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా చేసుకోవాలని, అందుకు నగరపాలక సంస్థ, హౌసింగ్ డిపార్ట్మెంట్లు సంపూర్ణ సహకారం అందిస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తెలిపారు. శనివారం బుడంపాడు 2, 3 జగనన్న లే అవుట్స్ లో ఇళ్ళ నిర్మాణాల పురోగతిని నగర కమిషనర్ గృహ నిర్మాణ శాఖాధికారులతో కలసి పరిశీలించారు.
తొలుత లే అవుట్స్ లో ఎన్ని ఇళ్లు నిర్మాణాలకు మంజూరు అయింది, నిర్మాణంలో ఉన్న ఇళ్ళ సంఖ్య వాటిలో బిలో బేస్మెంట్ లెవల్, బేస్మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఆర్ సి, పూర్తి అయినవాటి తదితర వివరాలను హౌసింగ్ ఈఈ కమిషనర్ కు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుడంపాడు 2 మరియు 3 లేఅవుట్స్ ల్లో 427 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని, లబ్దిదారులు కొందరు స్వంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని, కొందరు నిర్మాణం కాంట్రాక్టర్ కు అప్పగించారన్నారు. లబ్దిదారులు తమ ఇళ్ళ నిర్మాణం వేగవంతంగా చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి నీటి వసతి, విద్యుచ్చక్తి వంటి మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, లబ్దిదారులు త్వరగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి, డిసెంబర్ నెల చివరి వారం నాటికి గృహ ప్రవేశాలు చేసేలా చూడాలన్నారు. లే అవుట్ కు వచ్చే ప్రధాన రహదారికి టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని, కాంట్రాక్టర్ తో మాట్లాడి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. ఇతర ముఖ్యమైన రహదార్లు మరమత్తులు చేపట్టాలని హౌసింగ్ ఈఈ ని ఆదేశించారు. విద్యుత్ లైన్లను ఆ శాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. లే అవుట్ లో నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనుల వేగవంతంకు డి.ఈ.ఈ. స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించి, ప్రతి రోజు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. సచివాలయాల వారీగా లబ్దిదారులకు ఎమినిటి కార్యదర్శులు ఇళ్ళ నిర్మాణం పై అవగాహన కల్గించి, వారికి నిర్మాణ దశల్లో బిల్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ ప్రతి రోజు 30 ఇళ్లు బేస్మెంట్ లెవల్ ఇచ్చేలా చూడాలని హౌసింగ్ ఈ.ఈ.ని ఆదేశించారు.
పర్యటనలో నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, డి.ఈ.ఈ. హనీఫ్, హౌసింగ్ ఈ.ఈ. శంకరరావు, హౌసింగ్ డి.ఈ.ఈ. సత్యనారాయణ, ఏ.ఈ. సత్యనారాయణ, సచివాలయ కార్యదర్శులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *