Breaking News

డిసెంబర్ 18న దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత గిరిజన ప్రజల హక్కులు అవకాశాలు సంక్షేమ పథకాలు ప్రత్యేక రక్షణ చట్టాలు పరిరక్షణ కోసం డిసెంబర్ 18వ తేదీన విజయవాడ లో దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త మేలం భాగ్య రావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగ్యారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దళిత గిరిజన వ్యతిరేక విధానాలపై పార్టీలకు అతీతంగా పోరాడడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు దళిత గిరిజనుల హక్కులు, అవకాశాలు, ప్రత్యేక రక్షణ చట్టాలను నిర్వీర్యం చేయడంతో పాటు వీరి ఉనికిని కూడా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. దళిత గిరిజనులు తమ ఉనికిని కాపాడుకోవడంతో పాటు, తమకి తాము రక్షించుకోవడం కోసం సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. అధికార ప్రభుత్వాలకు ఉనికిని హక్కుల ఏజెండాను చాటి చెప్పటానికి 18వ తేదీ జింఖానా గ్రౌండ్స్ వద్దగల కందుకూరి కళ్యాణమండపంలో జరిగే దళిత గిరిజన జేఏసీ రాష్ట్ర సభకు అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. ఈ సదస్సుకు దళిత గిరిజన నాయకులు అనేకమంది పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ సిరంశెట్టి నాగేంద్ర, రేల్లికుల ఐక్య పోరాట కమిటీ ఇసుకల జయరాజ్, పరిస పోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *