విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత అభివృద్ధి పధకం క్రింద రాష్ట్రం పరిధి లోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధికల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్స్ట్ టైల్ డిజైనర్ మరియు క్లష్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ గా తమ సేవలను అందించే విధంగా ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
క్లష్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ అర్హతలు…
ఏ) హ్యాండ్ లూమ్ టెక్నాలజీ నందు డిప్లొమా కలిగి, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి..
బి) కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి..
(MS WORD / ఎక్సెల్ / పవర్ పాయింట్ ఎక్స్ పీరియన్స్)
టెక్స్ట్ టైల్ డిజైనర్ అర్హతలు…
ఏ) టెక్స్ట్ టైల్ డిజైన్ ఇనిస్టిట్యూట్ నందు ఉత్తీర్ణులై ఉండాలి..
బి) చేనేత విభాగంలో 2 సంవత్సరాల అనుభవంతో పాటు, డిజైనర్ గా అనుభవం కలిగి ఉండాలి. ఉత్పత్తి ఉన్నతిలో అభివృద్ధిలో అనుభవం కలిగి ఉండాలి.
సి) ఒక కంపెనీ డిజైనర్ ను సిఫార్స్ చేస్తున్నట్లయితే టెక్స్ట్ టైల్ డిజైనర్ యొక్క బయో డేటా, కంపెనీ పొందుపరచాల్సి ఉంటుంది.
అర్హత, అనుభవం, వయస్సు, స్థానిక నివాసం ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని కమిషనర్ అన్నారు. దరఖాస్తుతో పాటు ధృవపత్రాల కాపీలను జతపరచాల్సి ఉంటుందని, 3 ఏళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదికన నెలకు రూ. 30 వేలు సంఘటిత పారితోషికం అందించడం జరుగుతుందన్నారు. క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం లో టెక్స్ట్ టైల్ డిజైనర్ పోస్ట్ లు (3ఖాళీలు) మరియు క్లష్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు (3ఖాళీలు) గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులు డిసెంబర్ 31వ తేదీ లోపు కమిషనర్, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్థు, IHC కార్పొరేట్ బిల్డింగ్, ఆటో నగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ – 522 503 కు దరఖాస్తులను సమర్పించవలెను.
క్లష్టర్ మార్గదర్శకాలు…. www.aphandtex.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో గలవు.
Prajavartha Online Telugu News