Breaking News

సెలవు రోజుల్లోనూ ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటల వరకు పని చేయనున్న క్యాష్ కౌంటర్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2023-24) సంబందించిన ఆస్తి పన్నును ఏక మొత్తంగా ఏప్రిల్ నెలాఖరులోపు చెల్లించే వారికి మొత్తం పన్ను పై 5 శాతం రాయితీ లభిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు పని చేస్తాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని ఈ నెల 30లోపు ఏక మొత్తంగా ఆస్తి, ఖాలీ స్థల పన్ను చెల్లించి పన్ను రాయితీని వినియోగించుకోవాలని కోరారు. నగరపాలక సంస్థ 2023-24 డిమాండ్ మొత్తం ఆన్ లైన్ లో పొందుపరచడమైనదని, కావున ఆస్తి, ఖాళీ స్థలపన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఈ నెలాఖరు లోపు ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలని కోరారు. పన్ను చెల్లింపు సమాచారం కోసం ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పని చేసేలా హెల్ప్ డెస్క్ లను, పన్ను చెల్లింపుకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలలో అదనపు క్యాష్ కౌంటర్లను, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లో కూడా క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *