-కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్)
-ఆర్డీవో చైత్ర వర్షిణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు సబ్ కలక్టరు వారి కార్యాలయము నందు రూమ్ ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కంట్రోల్ రూం నందు సెల్ ఫోను నెం. 9032034601 మరియు 8106220484 ద్వారా వినతులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. కావున రాజమహేంద్రవరం డివిజన్‌కు సంబంధించి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News