Breaking News

వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి…

-సంక్షేమ ఫలాలు అర్హులకు అందిస్తున్న సేవకులు వాలంటీర్లు..
-నవరత్నాల సృష్టి కర్త ముఖ్యమంత్రి ఆశయ సారదులకు వందనం..
-జిల్లాకు చెందిన 8,997 మంది వాలంటీర్లకు సేవా అవార్డులు..
-జిల్లా కలెక్టర్‌ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల సృష్ఠి కర్త, సంక్షేమ పథకాలకు నిలువెత్తు సాక్షి, వాలంటీర్ల వ్యవస్థకు రూపశిల్పి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలను నేరవేరుస్తున్న ప్రతి ఒక్క వాలంటీర్‌ను అభినందిస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా అవార్డులు స్వీకరించిన జిల్లాకు చెందిన చెందిన వాలంటీర్లను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలకు లబ్దిదారుల ఎంపిక చేయడంలో వాలంటీర్లు పాత్ర మరువలేనిదన్నారు. కులమతాలు వర్గాలు రాజకీయలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడంతో పాటు అలుపెరగని సేవలు అందిస్తు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వాలంటీర్‌ ప్రతి ఒక్కరిని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రార్థించే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్‌ థెరీసా మాటలకు ప్రతి రూపమే వాలంటీర్ల వ్యవస్థ అన్నారు. పేద బలహీన వర్గాలవారిని ఆర్థికంగా బలోపేతం చేసి సామాజంలో ఉన్నత స్థాయిని కల్పించాలని ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ పేదలను ఆర్థిక పురోగతిలో నడిపిండంలో భాగస్వామ్యులవుతున్న వాలంటీర్లకు వందనం చేస్తున్నానన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో 605 సచివాలయాల ద్వారా 10,200 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారని వీరిలో 8,997 మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిలో 36 మందికి సేవా వజ్ర, 137 మందికి సేవా రత్న, 8824 మందికి సేవా మిత్ర అవార్డులతో సత్కరించి 9 కోట్ల 20 లక్షల 60 వేల రూపాయలు నగదు పురస్కారాలను అందుకోడం అభినందనీయమన్నారు. పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడంలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు వాలంటీర్లకు పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *