Breaking News

జగనన్నకు చెబుదాంకు 27 వినతులు

-వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలి : జాయింట్ కలెక్టర్

అర్ సి పురం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని , నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజల అర్జీలకు అర్థవంతoగా పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఉదయం మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గం ఆర్ సి పురం మండల కేంద్రం ఎం పి డి ఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ పలుప్రాంతాల నుండివచ్చిన వారినుండి వినతులను స్వీకరించి అక్కడే ఆన్ లో నమోదు చేసి పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేసారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు :
పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, పోలీస్, గ్రామీణ నీటిపారుదల, ల్యాండ్ అండ్ సర్వే లకు ఒక్కొక్కటి , రెవెన్యూ 16, ఆర్ అండ్ బి 3, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 3 వినతులు అందాయని
జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జెసి ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు ఆర్ సి పురం జెడ్పిటిసి డిల్లీరాణి, ఎంపిపి బ్రహ్మానంద రెడ్డి, తహశీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు ఎంపిడిఓ శ్రీనివాస్, జిల్లా స్థాయి , డివిజన్ , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *