Breaking News

ఈ నెల 26న గుంటూరులో ఆడుదాం ఆంధ్ర

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 26న గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని లయోలా స్కూల్ ల్లో జరిగే ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని, పర్యటన విజయవంతంకు నగరపాలక సంస్థ నుండి చేపట్టాల్సిన పనులను ప్రణాలికాబద్దంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి విభాగాదిపతులను ఆదేశించారు. శనివారం చుట్టగుంట నుండి లయోలా స్కూల్ వరకు ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళికాధుకారులతో కలిసి పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆడుదాం ఆంద్ర పోటీలను ముఖ్యమంత్రి గుంటూరు నగరం నుండే ప్రారంభించనున్నారని, లయోలా స్కూల్ పరిసరాల్లో, ముఖ్యమంత్రి పర్యటన మార్గాల్లో స్పెషల్ శానిటేషన్ పనులు చేపట్టాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. గ్యాంగ్ వర్క్ ద్వారా రోడ్ల స్వీపింగ్, బ్రషింగ్, క్లీనింగ్, హై బర్మ్స్ తొలగింపు పనులు వేగంగా జరిగేలా ఇన్సెపెక్టర్లకు విధులు కేటాయించాలని, ముఖ్యమైన పాయింట్స్ వద్ద ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు భాద్యతలు ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు లేకుండా పట్టణ ప్రణాళికాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డివైడర్లకు పెయింటింగ్, రోడ్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమత్తులు, లయోలా గ్రౌండ్ ని సిద్దం చేయడానికి అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచి, ఈ.ఈని కేటాయించాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. రోడ్ల మీద విధులు నిర్వహించే కార్మికులకు రేడియం జాకెట్స్ ఇవ్వాలని ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విధులు కేటాయించబడిన అధికారులు, కార్యదర్శులు, కార్మికులు పర్యటనలో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పర్యటనలో ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ (ఎఫ్ఏసి) మధుసూదన్, ఈఈలు, ఏసిపిలు, ఎస్ఎస్ లు, శాప్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *