Breaking News

సీఎం జగన్ పై దాడి ఘటనలో తెలుగుదేశం సోషల్ మీడియా దుష్ప్రచారం

-చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో తెలుగుదేశం సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఆదివారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి బాధాకరమని మల్లాది విష్ణు అన్నారు. ఈ ఘటనను పార్టీలకతీతంగా ఖండించాల్సిందిపోయి.. సోషల్ మీడియా వేదికగా బురదచల్లడం సిగ్గుచేటన్నారు. పైగా వివేకం సినిమాలోని పాత్రలతో తెలుగుదేశం సోషల్ మీడియా, ఐ-టీడీపీ వెబ్ సైట్లలో తప్పుడు పోస్టులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఆధారాలతో ఫిర్యాదులను అందించినట్లు తెలియజేశారు.

దళితులను వైసీపీకి దూరం చేసే కుట్ర
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అన్నివర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 58 నెలల్లో నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా 87 శాతం కుటుంబాల ఖాతాల్లో డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు జమ చేసినట్లు తెలిపారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్లు.. మొత్తంగా రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించినట్లు చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారని.. అది చూసి ఓర్వలేక ఆయా వర్గాలను సీఎం జగన్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దళితులపై దాడుల విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్ పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిపై పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు, కూటమి నేతలు ఈ ఎన్నికలలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం, ఈసారి పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *