Breaking News

సమస్యాత్మక, దుర్భర ప్రాంతాలను ముందుగా గుర్తించాలి

-వరద ముంపు నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముంపు ప్రాంతాలలో పునరావాస , గణన ప్రక్రియ విషయములో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా , డివిజన్, మండల స్థాయి అధికారులతో దుర్బలమైన ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు, పరిహార పంపిణీ , గణన, నష్ట నివారణ చర్యల విషయంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. తాహసిల్దారులు బదిలీ నేపథ్యంలో మండల స్థాయిలో డిప్యూటీ తాహసిల్దారులకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. ఆమేరకు విధులను నిర్వర్తించాలని, అలక్ష్యం ప్రదర్శించ రాదని స్పష్టం చేసారు. కార్యాలయ కాలపాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాల్సి ఉందన్నారు.

గ్రామ స్థాయిలో పంట నష్టాల , ఇతర నష్టాల గణన ను వేగవంతం చెయ్యాల్సి ఉందన్నారు. వాటి వివరాలను రెవిన్యూ డివిజన్ అధికారి ధృవీకరణ చేయాలన్నారు. ఎటిగట్లు, గోదావరీ గట్ల వద్ద బలహీనంగా, గండి పడే అవకాసం ఉన్న ప్రాంతాలను గ్రామస్థాయి సిబ్బంది ముందస్తుగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల నుంచి ఫిర్యాదు కంటే ముందుగా పంచాయతీ, వార్డు స్థాయిలో సిబ్బంది గుర్తించడం జరగాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలన్నీ సందర్శించి పంట నష్టరిహారాన్ని కౌలు రైతుల వారీగా సేకరిస్తున్నట్లు, గణన చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *