-ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు వి.విజయ్ రామరాజు IAS ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్టేట్ అసెస్‌మెంట్ సెల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://forms.gle/qFRjhWHMtVJ5UXUT8 …
Read More »Daily Archives: February 2, 2025
ఇది..పేదల సంక్షేమ, అభివృద్ధి వ్యతిరేక బడ్జెట్
-ఉపాధి హామీకి మొండిచేయి.. -కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాలకు లబ్ది -ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్‌లో ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంతా పాతదనమేనని, అందులో కొత్తదనం ఏమీ లేదని, ఈ బడ్జెట్ వల్ల పేదలకు ఏమి ఒరిగింది లేదనీ, ఆహార ధరలు తగ్గింపు కానీ, ఆరోగ్యం, విద్య, వైద్యం, వివిధ సంక్షేమ పథకాల గురించి ఏ మాత్రమూ కనికరించలేదని, నామమాత్రపు కేటాయింపులతో గొప్పలు చెబుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర …
Read More »సీఎం చంద్రబాబుకు ఎంపికేశినేని శివనాథ్ స్వాగతం
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే భాగస్వామిగా బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎంపి కేశినేని శివనాథ్ ఘనస్వాగతం పలికారు. ఆదివారం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, బస్తిపాటి నాగరాజు, రాజ్యసభ ఎంపి సానా సతీష్ లతో …
Read More »కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
-5వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ -హోరేబు మినిస్ట్రీస్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్‌లోని పెదబావి సెంటర్ సమీపంలో కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెల్సుకున్నారు. కొండ ప్రాంతంలో రోడ్లు, రెయిలింగ్, మెట్లు …
Read More »కోళ్ళు, చేపల అనధికార విక్రయాల పై ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని రోడ్ల పై నాటు కోళ్ళు, చేపల అనధికార విక్రయాల పై ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఆదివారం నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని చుట్టుగుంట, నల్లపాడు రోడ్డు,మిర్చియార్డ్, ఆర్.టి.ఓ ఆఫీసు, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు మరియు పట్టాభిపురం ప్రాంతాలలో రోడ్ల పై అనధికారికంగా …
Read More »స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా, సజావుగా నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ లో సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా, సజావుగా నిర్వహించాలని, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తెలిపారు. ఆదివారం ఉదయం కమిషనర్ ఎన్నికల అధికారి మరియు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మరియు ఇతర అధికారులతో కలిసి సోమవారం నిర్వహించనున్న స్టాండింగ్ కమిటి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన …
Read More »ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం కార్పొరేషన్ లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఫిబ్రవరి 3వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Read More »కనకదుర్గమ్మను దర్శించుకున్న డిజిపి హరీష్ కుమార్ గుప్తా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజీపి) హరీష్ కుమార్ గుప్తా, IPS ఈరోజు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వీరికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదార్వచనం చేయగా డిప్యూటీ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం వీరికి అందజేశారు.
Read More »తిరుమల వైభవం
-శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.? -తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. -ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక అటువంటి పవిత్ర తిరుమల యాత్ర ఎలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము. -కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. …
Read More »
Prajavartha Online Telugu News