Breaking News

Daily Archives: March 12, 2025

RELIANCE JIO Info.Comm Ltd, Optical Fiber Cable కంపెనీ వారికి ఫార్మాట్ -1 సర్టిఫికెట్ ఇవ్వడానికి అనుమతి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : RELIANCE JIO Info.Comm Ltd, Optical Fiber Cable కంపెనీ వారికి ఫార్మాట్ -1 సర్టిఫికెట్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుదవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి కమిటీ పై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వెంకటగిరి మండలం బుస్సపాలెం గ్రామం, …

Read More »

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలకు 29,041 మంది విద్యార్థులు

-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ -II, ఎకనామిక్స్ పేపర్ -II మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 29,041 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29,041 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 …

Read More »

జర్మనీలో ఉద్యోగావకాశాలు – మెకాట్రోనిక్స్ నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణతో పాటు మెకాట్రోనిక్స్ ఉద్యోగావకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన అర్హతలు: ✔ జాబ్ రోల్: స్కిల్డ్ మెకాట్రోనిక్స్ ✔ అర్హత: మెకాట్రోనిక్స్ / ఎలక్ట్రికల్ / ఎనర్జీ సిస్టమ్స్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ✔ వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల మధ్య …

Read More »

మెష్ ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో హోటల్స్ తప్పనిసరిగా వ్యర్ధాలను డ్రైన్ లోకి నేరుగా పంపకుండా మెష్ లు ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్  రైల్ పేట ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట రోడ్, డ్రైన్ల ఆక్రమణలు, హోటల్స్ వ్యర్ధాలు డ్రైన్లలోకి నేరుగా రావడం గమనించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్ పేట …

Read More »

కంపోస్ట్ తయారీ, పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు తగిన అవగాహన కల్గించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణం, ప్రజారోగ్యానికి భంగంగా పరిణమించిన నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని గుంటూరు నగరంలో జిఎంసి ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది, ప్రజలు సంయుక్తంగా కృషి చేస్తేనే నిలువరించగలమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. బుధవారం స్థానిక రెవెన్యూ భవన్ లో ఐటిసి మిషన్ సునేహరకల్, బంగారు భవిష్యత్ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులకు ప్లాస్టిక్ నిషేధం, వ్యర్ధాల నిర్వహణ, హోమ్, క్లస్టర్ కంపోస్ట్ తయారీ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ …

Read More »

ఈ నెల 15లోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మీడియా డివైజ్ డిస్ప్లే బోర్డ్స్ నిర్వహకులు ఈ నెల 15లోపు డిస్ప్లే ఫీజు బకాయిలు మొత్తం చెల్లించాలని, చెల్లించని వారి బోర్డ్ లను 16వ తేదీ నుండి తొలగిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ గత ఫిబ్రవరి 24న బోర్డ్స్ ఏజన్సీల నిర్వహకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత ఏడాది, గతంలోని బకాయిలు మొత్తం మార్చి …

Read More »

అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలి…

కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి ప్రతి గ్రామానికి.. సంక్షేమం ప్రతి ఇంటికి చేరాలనే కొత్త ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు పనిచేస్తున్నట్లు రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం పండూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్..కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కుడా చైర్మన్ తుమ్మల …

Read More »

Today’s meeting with Governor of Telangana, Jishnu Dev Varma

Telangana, Neti Patrika Prajavartha : The meeting was held an opportunity to interact with Shaik Khalifa Thulla Basha, Chairman of Aadil Group of Businesses, and discussed a different ways to promote business growth and development in Telangana. Mr. Basha’s leadership in the business sector, combined with his role as President of the Bharatiya Janata Majdoor Cell (BJMC) in Andhra Pradesh,The …

Read More »

సిద్ధాంతాలే ఊపిరిగా పురుడు పోసుకున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ చరిత్రలోనే వైఎస్సార్‌ సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, …

Read More »

విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. బుధవారం మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం నుంచి ప్రారంభమైన ‘యువత పోరు’ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం …

Read More »