Breaking News

Daily Archives: April 10, 2025

భారత సైన్యంలో నియామకాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత సైన్యంలో నియామకాలకు రిజిస్ట్రేషన్ చివరి తేదీని ఇప్పుడు ఏప్రిల్ 25, 2025 వరకు పొడిగించారు. మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం, అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) జూన్ 2025 నెలలో తెలుగుతో సహా 13 వేర్వేరు భాషలలో నిర్వహించబడే అవకాశం ఉంది. గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు ఆంధ్రప్రదేశ్‌లోని …

Read More »

వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి

-అనవసర రాద్దాంతం, అసభ్యకర భాష కారణంగా ప్రజలు మిమ్మల్ని 11కి పరిమితం చేశారు -అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది -లో ఓల్టేజ్ సమస్యను అరికట్టేందుకు కొత్తగా సబ్ స్టేషన్లు ఏర్పాటు -ప.గో ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. గురువారం ప.గో జిల్లా తణుకులో ఇంచార్జ్ మంత్రి హోదాలో …

Read More »

ఈనెల 15వ తేదీలోపు ఇంటర్, 22న పదో తరగతి పరీక్షల ఫలితాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయింది. తాజాగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియను చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈసారి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఏప్రిల్ 22 న పదో తరగతి పరీక్షల ఫలితాలు …

Read More »

ఏక మొత్తంగా చెల్లించే ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ఈ నెలాఖరు వరకు పొడిగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ గురువారం జిఓ.ఎంఎస్ నం.66 ని జారీ చేసిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ఆస్తిపన్ను, …

Read More »

మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్ననగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో జరిగిన మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ లు హాజరైన సదస్సులో నగర కమిషనర్ పాల్గొన్నారు. వర్క్ షాప్ లో మంత్రి మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీరు, స్ట్రీట్ లైట్లు, రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు చేయాలని, పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు …

Read More »

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు స్థాయికి చేర్చవలసిన బాధ్యత వ్యవసాయ విద్యార్థుల మీద వుంది

-కళాశాల అసోసియేట్ డీన్ డా. శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం విద్యార్థులు RAWEP ప్రోగ్రామ్ లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమం కోరుకొండ మండలం, శ్రీరంగ పట్నం గ్రామం లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఆఖరు రోజు అయిన ఏడవ రోజు రైతు సదస్సు తో పాటు శాస్త్రవేత్తలు రైతుల చర్చా గోష్టి నిర్వహించారు. ముందుగా మాజీ మార్కెట్ …

Read More »

సంక్షేమ వసతి గృహాలను సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మీ పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. స్థానిక ఆవా రోడ్డు లో ఉన్న ఏకలవ్య బాలల వసతి గృహం, బొమ్మూరు లో ఉన్న బాలికల శిశుగృహ వసతి గృహం ను సందర్శించి, వసతులను పరిశీలించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వసతి గృహాల సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షిత త్రాగు నీరు, మంచి …

Read More »

నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాల నాణ్యత ,స్వచ్ఛతను మెరుగుపరచడం కోసం పొలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై నియోజక వర్గ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి తెలియ చేశారు. గురువారం సాయంత్రం డి ఆర్వో ఛాంబర్ లో. అసెంబ్లీ నియోజక వర్గాల ఈ ఆర్ వో లతో, ఇతర సిబ్బంది తో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి …

Read More »

రెవెన్యూ అధికారులు కార్యశాల  ఒక నిర్ణాయక పాత్రకు వేదికగా నిలవాలి

-అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి -పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి -ఫలవంతమైన దిశగా ఒక రోజు రెవెన్యూ అధికారులు కార్యశాల -అర్జిల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏదైనా ఒక సమస్య వొస్తే దాని స్థాయినీ కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని, హేతుబద్ధత కలిగిన పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి, ఇతర సమస్యలకు పరిష్కారం సాధ్యం …

Read More »

క్రికెట‌ర్ వెలుగోటి రాజ‌గోపాల్ యాచేంద్ర సేవ‌లు చిరస్మరణీయం

-యాచేంద్ర మృతికి సంతాపం తెలిపిన ఏసీఏ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని, ఏసీఏ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ వెలుగోటి రాజ‌గోపాల్ యాచేంద్ర (93) మృతి పై . ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఏసీఏ కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రికెట్ రంగంలో తీర‌ని లోట‌ని ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »