-కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన సతీమణి కేశినేని జానకీ లక్ష్మీ, కుమారుడు వెంకట్ తో కలిసి శ్రీవాయు లింగేశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆస్థాన మండపం నందు స్వామి వారి శేష …
Read More »Daily Archives: April 10, 2025
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ఎంపి కేశినేని శివనాథ్
-కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలోని స్వామి వారిని గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన సతీమణి కేశినేని జానకీ లక్ష్మీ, కుమారుడు వెంకట్ తో కలిసి శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం …
Read More »16వ ఆర్థిక కమిషన్ ఈ నెల17, 18 రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 16వ ఆర్థిక కమిషన్ ఈ నెల 17, 18 రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు 16వ ఆర్థిక కమిషన్ పర్యటన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా …
Read More »రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
-ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సంవత్సరంలో పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందని, అందు కొరకు ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, మానవ వనరులు, పోలీస్ బలగాలు, ఎలక్టోరల్ రోల్ తదితర అంశాలపై దృష్టి సారించి, ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ఉండాలని ఆం.ప్ర రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. …
Read More »సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచన లు మేరకు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా డిపిఓ మరియు నారావారిపల్లి స్పెషల్ ఆఫీసర్, .సుశీల దేవి పర్యవేక్షణలో ఈరోజు టైలరింగ్ శిక్షణ కార్యక్రమం రెండు బ్యాచులు, అలాగే అసిస్టెంట్ టెక్స్టైల్ ప్రింటర్ ఒక బ్యాచ్, మొత్తం 60 మందికి సెంట్రల్ గవర్నమెంట్ సంకల్ప్ పథకం ద్వారా డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ అధ్యక్షతన కలెక్టర్, చైర్మన్ మరియు పిడి, డిఆర్డిఏ, కన్వీనర్ గా …
Read More »ప్రజలకు సంతృప్త స్థాయిలో రెవెన్యూ, సర్వే శాఖల సేవలను అందించుటకు సలహాలు సూచనల కొరకు ఫలవంతంగా వర్క్ షాప్ నిర్వహణ…
-వర్క్ షాప్ నందలి సూచనలు, సలహాలు సీసీఎల్ఎ కి నివేదిస్తాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పీజీఆర్ఎస్ నందు ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ, సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ …
Read More »ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభ సాటి… : జిల్లా కలెక్టర్
పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభ సాటి అని, రైతులందరూ ఆ దిశగా ఆలోచన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం ఆయన పెదపారుపూడి మండలంలోని పెదపారుపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయల సాగును పరిశీలించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా రెండెకరాలను కౌలుకు తీసుకుని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన మేడికొండ నాగులు కలెక్టర్కు వివరించారు. ప్రధాన పొలంలో వరి సాగు, …
Read More »పేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికలు… : జిల్లా కలెక్టర్
గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన గుడ్లవల్లేరులోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశమై అత్యంత పేదల జాబితాను సిద్ధం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలంలో సామాజిక ఆర్థిక జీవన స్థితిగతుల ఆధారంగా అత్యంత పేదలను గుర్తించి జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పేదలను గుర్తించడంతోపాటు …
Read More »సమస్యలు తలెత్తకుండా రీ సర్వే… : జిల్లా కలెక్టర్
పాములపాడు (పెదపారుపూడి), నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీ సర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయ భవనంలో రీ సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రీ సర్వే ప్రక్రియ, తలెత్తిన సమస్యలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో ఆక్వా సాగు అధికమని, వ్యక్తిగతంగా కాకుండా ఒకే చేపల చెరువు …
Read More »మనిషి ఆరోగ్యం, నేల సారవంతం కోసం ప్రకృతి వ్యవసాయం… : జిల్లా కలెక్టర్
ఇందుపల్లి (ఉంగుటూరు), నేటి పత్రిక ప్రజావార్త : మనిషి ఆరోగ్యం, నేల సారవంతం కోసం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించడం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఉంగుటూరు మండలం, ఇందుపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించే రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవని, తక్కువ పెట్టుబడితో అధిక …
Read More »
Prajavartha Online Telugu News