Breaking News

Daily Archives: April 15, 2025

అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. మంగళవారం చుట్టగుంట జంక్షన్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అన్న క్యాంటీన్లలో ఆహారం అందించేలా, క్యాంటీన్లలో తగిన మౌలిక వసతులు అందేలా జిఎంసి సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించామన్నారు. నోడల్ అధికారులు ప్రతి …

Read More »

అధికారులు స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని వార్డ్ సచివాలయాల కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం బ్రాడీపేట, కోబాల్ట్ పేట, లక్ష్మీపురం, ఎన్టీఆర్ స్టేడియం, ఏటి అగ్రహారం, చుట్టగుంట జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తొలుత …

Read More »

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గద్దె క్రాంతి కుమార్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 6వ డివిజన్ మారుతీ నగర్ కోకొకోలా స్ట్రీట్ రామాలయం వద్ద మంగళవారం జరిగిన శ్రీరామనవమి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్. అన్నదానా కార్యక్రమం నిమిత్తం కమిటీ సభ్యులకు గద్దె క్రాంతి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 4 వేల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్, పునుగుమటి మోహనరావు, ఆలయ కమిటీ సభ్యులు వేముల …

Read More »

చిత్తూరు జిల్లాలో కొత్త ప్రైవేట్ హోమీయోప‌తి క‌ళాశాల‌

-ప్రైవేట్ రంగంలో ఇది ఐదో క‌ళాశాల‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వైద్య విధానాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రాధాన్య‌తనిస్తున్న నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాకు కొత్త ప్రైవేట్ హోమియోపతి కళాశాల మంజూర‌య్యింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు హోమియోపతి కళాశాలలు మాత్రమే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ముత్తిరేవుల గ్రామంలో శ్రీనివాస ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా హోమియోపతి కళాశాల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపారు. వెంకటేశ్వర …

Read More »

ఎంబిబియ‌స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో కాపీయింగ్ పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి

-డిఎంఇని ఆదేశించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ప్ర‌భుత్వ సిద్దార్ధ మెడిక‌ల్ కాలేజీలో ఎంబిబియ‌స్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో కాపీయింగ్ జ‌రిగిన‌ ఘటన ప‌ట్ల వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆగ్ర‌హం, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించి లోతైన విచార‌ణ జ‌రిపి స‌మ‌గ్ర‌మైన నివేదిక‌ను అంద‌జేయాల‌ని డిఎంఇ డాక్ట‌ర్ న‌ర‌సింహంను మంత్రి ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌కు దారితీసిన వ్య‌వ‌స్థాగ‌త‌, వ్య‌క్తిగ‌త లోపాల‌పై దృష్టి సారించి, ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకునే దిశ‌గా …

Read More »

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెనుకబడిన తరగతుల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని, గతంలో ఎన్నడూ లేనంతగా బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్నికల్లో బీసీలకిచ్చిన ప్రతి హామీని నెరవేరేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ కులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి …

Read More »

లేబర్ కొడ్స్ వ్యతిరేకిస్తూ మే 20నజరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోరుతూ…

-25న రాష్ట్ర సదస్సు -కార్మిక సంఘాల పిలువు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక వ్యతిరేక లేబర్ కొడ్స్ రద్దు చేయాలని మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.. ఈ మేరకు మంగళవారం బాలోత్సవ్ భవన్లో రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాల నాయకుల సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ …

Read More »

రైతుల‌కు అభ‌య‌మిచ్చిన ఎంపి కేశినేని శివ‌నాథ్

-జిల్లా అధికారులతో చ‌ర్చించిన‌ త‌డిసిన‌ ధాన్యం కొనుగోలు అంశం -క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తో మాట్లాడిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల జిల్లాలో కురిసిన అకాల వ‌ర్షాల‌కు త‌డిసిన ధాన్యాన్ని రైతుల వ‌ద్ద నుంచి మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించి కొనుగోలు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంగ‌ళ‌వారం విజ‌యవాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు. వ‌ర్షాల కార‌ణంగా జిల్లాలో కొన్ని చోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విష‌యం, మ‌రికొన్ని చోట్ల‌ కల్లాలు, మిల్లులు …

Read More »

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం…

-రాజవోలు గ్రామంలో హై స్కూల్ నందు బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రాజవోలు గ్రామంలో స్థానిక హై స్కూల్ నందు కీ. శే గోరంట్ల శాంతారాం వారి జ్ఞాపకార్థం జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2లక్షల 50వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ కోర్టును రూరల్ …

Read More »

మంచి రోజులు వచ్చాయి రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చింది..

-రాజవోలు గ్రామంలో రైతులకు వ్యవసాయ యాంత్రికరణలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త మంచి రోజులు వచ్చాయని రైతులకు మంచి చేసే కూటమి ప్రభుత్వం వచ్చిందని, రైతన్నకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం ముందుకెళుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మంగళవారం రాజవోలు గ్రామంలో మూడు కిషీ ట్రాక్టర్లు (పవర్ టిల్లర్) ఒక రోటోవేటర్, బ్యాటరీ స్ప్రేయర్లు అర్హులైన రైతులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, …

Read More »