-ఏపీలో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్లుగా ఎదగాలని కోరుకుంటున్నాం -చంద్రబాబు బ్రాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు వస్తున్నాయి -గన్నవరం మేధా హైటెక్ సిటీలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ -ఏడాదిలోగా మరో వెయ్యి ఉద్యోగాలను కల్పించనున్న ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజన్లుగా ఎదగాలని కోరుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైద్య సాంకేతికత, సేవల …
Read More »Daily Archives: July 19, 2025
గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో శనివారం జరిగిన ఎ.ఎమ్.సి పాలకవర్గ సమావేశం అనంతరం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని కచ్చితంగా నిషేధించాలని ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంను ఎ.ఎమ్.సి చైర్మన్ నర్రా వాసు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్రా వాసు మాట్లాడుతూ సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ని షేధిద్దామని, మొదటిగా ఇక్కడ నుండి ప్రారంభించి ప్రజల సహకారంతో విధిగా ప్లాస్టిక్ బ్యాన్ నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు …
Read More »నూతనంగా A3 కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహారప్రియుల అభిరుచులకు అనుగుణంగా నాన్ వెజ్ టిఫిన్ లు అనుభవజ్ఞులైన చెఫ్ లతో వినూత్నమైన వంటకాలతో ముందుకు రావడం జరిగింది అని A3 కిచెన్ ఫ్యామిలీరెస్టారెంట్ అధినేతలు చల్లపల్లి ఆనంద్,లక్ష్మీ దుర్గ తెలిపారు. గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ లో A3కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ఎం పి కేశినేని శివనాద్ (చిన్ని), తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ప్రారంభ అనంతరం చల్లపల్లి ఆనంద్,లక్ష్మీ దుర్గ కు …
Read More »ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం..
– మన ఆరోగ్యాన్ని, ఆర్థిక ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ కాపాడుకుందాం – ప్రతి గ్రామాన్నీ స్వచ్ఛ గ్రామం, స్వర్ణగ్రామంగా తీర్చిదిద్దుదాం – సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చట్టరీత్యా నేరం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్నీ, ఆర్థిక ఆరోగ్యాన్నీ కాపాడుకుందామని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. శనివారం నందిగామ మండలం, పెద్దవరం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. స్థానిక …
Read More »దేశంలోనే ఉన్నతంగా ఉండేలా కేడీసీసీ బ్యాంకును తీర్చిదిద్దాలి : ఎంపీ కేశినేని శివనాథ్
-గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని సహాకార రంగాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి -ది గుణదల ప్రాధమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో -ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కో–ఆపరేటివ్ బ్యాంక్(కేడీసీసీ)ను దేశంలోనే ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్‌లోని గుణదల పాత పంచాయితీ ఆఫీసులో ది …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపూడి ఎ.ఎమ్.సి ఆదర్శంగా నిలవాలి : ఎంపీ కేశినేని శివనాథ్
-గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వసంత సందర్శన.. -ఏ.ఏం.సి పాలకవర్గంతో సమావేశమైన ప్రజాప్రతినిధులు గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ల కంటె గొల్లపూడి ఎ.ఎమ్.సి ఆదర్శంగా నిలవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం లోని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో శనివారం జరిగిన ఎ.ఎమ్.సి పాలకవర్గ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఎ.ఎమ్.సి చైర్మన్ నర్రా వాసు, వైస్ …
Read More »ఉప్పాల హారికపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలి…
-రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరావు గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉప్పాల హారికపై దాడి చేసిన వారిని తక్షణం అదుపులోకి తీసుకొని కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరావు గౌడ్ డిమాండ్ చేశారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ చైర్ పర్సన్ జ్ఞాన సుందరి, మహిళా సంఘాలు, పలు బీసీ సంఘాల నేతలంతా కలిసి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో …
Read More »సంక్లిష్ట గుండె సమస్యలకు నూతన పరిష్కారం కనుగొన్న కె.ఎల్.యు పరిశోధనా విద్యార్థిని శ్రేయ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కె.ఎల్ డీమ్డ్ యూనివర్శిటీలోని ఫార్మసీ కళాశాలలో పరిశోధన విద్యార్థిని శ్రేయ కొసనం గుండె సంబంధిత సమస్యలకు మొక్కల ఆధారిత చికిత్సలతో నూతన పరిష్కారాలను కనుగొన్నట్లు కెఎల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రవర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ రాజేశ్వరి పసుపుల మార్గదర్శకత్వంలో గుండె సంబంధిత వ్యాధులపై పరిశోధన చేసిన శ్రేయ కొసనం గుండెకు ఏర్పడే పలు రకాల సమస్యలకు సాంప్రదాయ మొక్కల నుండి పలు రకాల ఔషధాలు తయారు చేయవచ్చుననే పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్లు …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ (మై భారత్) ఆధ్వర్యంలో శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి సుంకర రాము, విజయవాడ ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ …
Read More »చేతివృత్తులకు చేయూతగా విశ్వకర్మ యోజన పథకం : ఆకాశవాణి రీజినల్ న్యూస్ హెడ్ హెన్రీ రాజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంప్రదాయ కళాకారులు మరియు చేతివృత్తుల వారికి ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం విశ్వకర్మ యోజనను ఉపయోగించుకోవాలని, ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి హెన్రీ రాజ్ శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎంఎల్ఎ క్యాంప్ ఆఫీస్ లో ‘మై భారత్’ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఒక రోజు వర్క్‌షాప్‌లో లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. ‘మై భారత్’ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హెన్రీ రాజ్, …
Read More »
Prajavartha Online Telugu News